Followers

03 August, 2021

అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)

 అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)

 ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు
 సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.(G.O.Ms.No.165 Dt:17-08-1967)
 ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు
 అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు. అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.
 వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)
 స్వంత వ్యవహారాలపై (Private Affairs)
 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.
 ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.
 వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను *కమ్యూటెడ్ సెలవు* అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
{APLR 15(B) & 18(B}
 కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచడనమైనది.
(G.O.Ms.No.186 Dt:23-07-1975)

 సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}
 ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.
 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.
 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు (Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)
(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)
 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.
 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును. (G.O.Ms.No.386 Dt:06-09-1996)  (G.O.Ms.No.449 Dt:19-10-1976)
 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. (G.O.Ms.No.29 Dt:09-03-2011)
 ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968)

 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.
 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు. (G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)

ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు......

 *ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు......*


✍ అంత్యక్రియలకు సాయం

*ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.20 వేలు అందిస్తారు. G.O.Ms.No.122, GA(SW) Department, Dt: 11.04.2016 ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు.*

 

✍ *మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్‌ 23న జీవో 153 జారీచేశారు.*

 

✍ ఎన్‌క్యాష్‌మెంట్‌

*మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 16న జీవో 232 జారీచేశారు.*

 

✍ యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా

*విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న 317 జీవో జారీచేశారు.*

 

✍ రవాణా చార్జీలు

*ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు.*


✍ సస్పెన్షన్‌లో ఉంటే..

*ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.. సస్పెన్షన్‌ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.*

 

✍ కారుణ్య నియామకం - కరువుభత్యం

*ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) ను కుటుంబ పెన్సన్‌ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో 89లో తెలుసుకోవచ్చు.*

 

✍ సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే...

*విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటంబసభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.*

 

✍ ఫ్యామిలీ పింఛన్‌

*ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్‌ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్‌ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పింఛన్‌రూల్స్‌కు అనుగుణంగా కుటుంబ పింఛన్‌ వర్తిస్తుంది.*

 

✍  చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు

*ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతిచెంది ఉంటే ఆమొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.*

 

✍ రిఫండ్‌

*ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్‌ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్‌ 9న జారీ చేసిన జీవో 307తో పాటు 1983 ఏప్రిల్‌ 27నజారీ చేసిన జీవో 55 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.*

19 April, 2021

డార్విన్ గారి వర్ధంతి

@శ్రీనివాస్@

నేడు "చార్లెస్ రాబర్ట్ డార్విన్" గారి వర్ధంతి..

చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఆంగ్లం :Charles Robert Darwin) (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది,ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు. మరియు జీవపరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు.

తండ్రి దృష్టిలో పనికిరాని వాడు.. ఉపాధ్యాయుల మాటల్లో మందబుద్ధివాడు.. ఇలా విమర్శల మధ్య ఎదిగిన ఓ కుర్రాడు.. అసలు మనిషి ఎలా పుట్టాడో చెప్పగలిగాడు! అతడే డార్విన్‌!
ఇంగ్లండులో ఒక డాక్టర్‌ తన స్నేహితులతో కొడుకు గురించి చెబుతూ బాధపడేవారు.. 'వాడొక పనికిమాలిన వాడు. మా కుటుంబానికి తీరని మచ్చ' అని. దానికి కారణం ఆ బాలుడు ఎప్పుడూ బొద్దింకలు, గొంగళి పురుగులు, సీతాకోక చిలుకల్లాంటి జీవుల్ని జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తెచ్చేవాడు. వాటికి తిండి పెడుతూ, పరిశీలిస్తూ కాలక్షేపం చేసేవాడు. ఇంట్లో ఎక్కడైనా దుర్వాసన వస్తే ఆ కుర్రాడు తెచ్చిన ఏ జీవో చచ్చి ఉంటుందని పెద్దవాళ్లు వెతికేవారు. అలాంటి కుర్రాడు పెరిగి పెద్దయ్యి ఈ భూమిపై జీవరాశులు ఎలా ఉద్భవించాయో, ఎలా పరిణామం చెందాయో, మానవుడు ఎలా పుట్టుకొచ్చాడో సాధికారికంగా చెప్పగలిగాడు. మానవ విజ్ఞానాన్నే మలుపు తిప్పిన గ్రంథం 'ద ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీసీస్‌' రచించాడు. అతడే ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌.

డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో పుట్టాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. అతడొక మందబుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు. తండ్రి వైద్యవిద్య కోసం ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేర్చినా డార్విన్‌ కొనసాగించలేకపోయాడు. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో తత్త్వశాస్త్ర అధ్యయనంలో చేరినా అక్కడా అంతే. అక్కడి ప్రొఫెసర్‌ ఓసారి అతడికి 'బీగల్‌' అనే ఓ నౌక కెప్టెన్‌కి పరిచయం చేశాడు. వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్‌ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్‌ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు. ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని, అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక (natural selection) ద్వారా పరిణామం చెందాయని డార్విన్‌ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీలను సంఘటిత పరచడంలోనూ, డీఎన్‌ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది.

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin's theory of evolution) భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి కోతి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరిపోసింది. మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్1844లో తన రచనను, వాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.

ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివే. గతంలో వీటికి తలొక "పూర్వీకుడూ" ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ "ఆదిమ" శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు "వాటంతట అవే" ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది.

ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలిమానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవసమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషిజాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. దీని కారణంగానే జీవపరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఎక్కువ సంఖ్యలో లేరు.

 ప్రశంసలు

చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.

 విమర్శలు

కొన్ని క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమయ్యింది. సృష్ఠివాదాన్ని వ్యతిరేకించడం దైవ ద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిధ్ధాంతాన్ని నిషేదించారు. ఈ సిద్ధాంతం తప్పని, జీవ పరిణామక్రమం జరగలేదని వాదించేవారిలో టర్కీ దేశానికి చెందిన ఇస్లామిక్ రచయిత హారూన్ యాహ్యా ఒకరు.


 

23 August, 2020

టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి


@శ్రీనివాస్@

సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి నేడు...

ఆయన గుండెల మీద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడింది. కానీ స్వజాతి నాయకత్వం మాత్రం ఆయన గుండెలని పగలగొట్టాలని విశ్వ ప్రయత్నమే చేసింది. అయినా నమ్మినదే చేశారాయన. కుమిలిపోలేదు. విశ్వసించినదానినే గౌరవించారు. వైరాగ్యాన్ని దరి చేరనీయలేదు. తుది పైసా కూడా జాతి స్వేచ్ఛ కోసం అర్పించారు. తన కడుపులో పేగులు ఆకలితో గాండ్రిస్తున్నా వినిపించుకోకుండా, ప్రజల క్షుద్బాధనే పట్టించుకున్నారాయన. అందుకు, ఆయన ‘ఆంధ్రకేసరి’. కానీ, ఆయన అణువణువూ సింహమే, అన్నారు రాజాజీ. ఆయన ఏం చేసినా ఆంధ్రుల అభ్యుదయం కోసమే అన్నారు జవహర్‌లాల్‌. నిజమే, చరిత్రలో ఎక్కడో గాని తారసపడని ఓ కచ్చితమైన ప్రజల మనిషి. ఆయన– టంగుటూరి ప్రకాశంపంతులు.  ఆంధ్రకేసరి జీవిత చరిత్ర మీద సింహావలోకనం చేసినా రోమాంచితం చేసే ఘట్టాలు కనిపిస్తాయి, అడుగడుగునా. ప్రకాశం (ఆగస్టు 23, 1872 – మే 20, 1957) చరిత్ర అంటే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రే అనకపోవచ్చు. టంగుటూరి ఉద్యమం అంటే ఆంధ్రుల ఉద్యమ చరిత్ర అని కూడా అనకపోవచ్చు. కానీ ప్రకాశం అంటే... దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్టు ‘మూడుకోట్ల జనం పేరు’. అంటే నాటి ముక్కోటి ఆంధ్రుల హృదయ స్పందన.  ఒంగోలు సమీపంలోని కనపర్తి అనే గ్రామంలో మేనమామల ఇంట ప్రకాశం పుట్టారు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మగారు. పూర్వీకులది టంగుటూరు. తరువాత ప్రకాశం గారి తాతగారు వల్లూరు వచ్చేశారు. కాబట్టి మాది వల్లూరే అని ప్రకాశం గారు రాసుకున్నారు. అద్దంకి, వినోదరాయుడిపాలెం, నాయుడుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరాలలో ప్రకాశం బాల్యం గడిచింది. ప్రాథమిక విద్య కూడా ఆ ప్రాంతాలలోనే జరిగింది.

ప్రకాశం గారి జీవితంలో ఒంగోలు ప్రయాణం, అక్కడ నుంచి గోదావరి గట్టున రాజమహేంద్రవరానికి చేరుకోవడం ఆకస్మికంగా, నాటకీయంగా జరిగాయి. అవే ప్రకాశాన్ని తీర్చిదిద్దాయి. 1884లో గోపాలకృష్ణయ్య హఠాత్తుగా కన్నుమూశారు. దీనితో సుబ్బమ్మగారు ఒంగోలు చేరుకుని చిన్న భోజనశాలను ఏర్పాటు చేసింది. గోపాలకృష్ణయ్య మరణించేనాటికి సుబ్బమ్మగారు గర్భిణి. తండ్రి పోయిన తరువాత ఈ భూమ్మీద పడినవాడే జానకిరామయ్య. ప్రకాశం తమ్ముడు. ఆ నాలుగు మాసాల పురిటికందుతోనే, పచ్చి బాలింతగానే ఆమె ఒంగోలు వచ్చి దారుణమైన శ్రమకోర్చి ఆ చిన్న భోజనశాల నిర్వహించారు.అప్పటికి ప్రకాశం వయసు పన్నెండేళ్లు. ఒంగోలు పాఠశాలలో ఆనాటి ప్రధానోపాధ్యాయుడు బాగా చదివే పిల్లలను ఇంటికి రప్పించుకుని మరీ చదువు చెప్పేవారు. అలాంటి అవకాశం ప్రకాశంగారికి కూడా దక్కింది. అలా అని ప్రకాశం బుద్ధిమంతుడైన విద్యార్థి మాత్రం కాదు. ఒకవైపు పోకిరి పిల్లలతో కలసి అల్లరి. ఇంకోవైపు నాటకాలు. చిలిపి అల్లరి కాస్తా నేరాల స్థాయికి పోకుండా తనను కాపాడినవి నాటకాలేనని ప్రకాశంగారు భావించారు. నాటక పరిచయం ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ప్రకాశం నిజ జీవితంలోకి ఒక గొప్ప పాత్రను ప్రవేశపెట్టింది రంగస్థలం. ఆయన మిడిల్‌ స్కూల్‌లో లెక్కల మాస్టారు.ఇంగ్లిష్, ఇంగ్లిష్‌ గ్రామర్‌ కూడా బాగా చెప్పేవారని ప్రతీతి. పేరు ఇమ్మానేని హనుమంతరావునాయుడు గారు. రాజమహేంద్రవరంలో మరో అంకం సాగడానికి కారకుడు కూడా నాయుడుగారే. నాయుడుగారు ముప్పయ్‌ రూపాయల జీతంతో పనిచేసే బతకలేని బడిపంతులే. ఆయనా, ప్రకాశం ఏ క్షణంలో కలుసుకున్నారో గాని, మానవ సంబంధాలలోనే అదొక మంచి ముహూర్తంగా చెప్పాలి. ఆయన శిష్యరికంలోనే ప్రకాశం మిడిల్‌ స్కూల్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కానీ ఆ పరీక్షకు మూడు రూపాయల రుసుము చెల్లించాలి. ఇందుకోసం ఒంగోలుకి పాతికమైళ్ల దూరంలో ఉన్న బావగారింటికి నడిచి వెళ్లారు ప్రకాశం. కానీ బావ కూడా డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. చివరికి సుబ్బమ్మగారే తన పట్టుబట్టను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కొడుక్కి ఇచ్చారు. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక కొత్త సమస్య వచ్చింది. మిడిల్‌ స్కూల్‌ పరీక్ష ఉత్తీర్ణత మెట్రిక్‌తో సమానం. అందుకే, ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది. అలా సుబ్బమ్మగారిని భోజనశాల పని నుంచి తప్పించాలన్నదే వారందరి కోరిక. కానీ ప్రకాశం జీవితాశయం న్యాయవాది కావడం. అదే చెప్పారు. ఆ తల్లి కూడా అందుకే మొగ్గారు. చదువు కొనసాగింది.

ఆ సమయంలోనే హనుమంతరావునాయుడు తన భార్య కోరిన మీదట రాజమండ్రి యాత్రకు బయలుదేరారు. వారి వెంటే ప్రకాశం రాజమండ్రి వెళ్లారు. ఒంగోలు నుంచి బెజవాడ. అక్కడ నుంచి విజ్జేశ్వరానికి ఎడ్ల బండి. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవర పట్టణ ప్రవేశం. మొత్తం పదిరోజులు.  అనుకోకుండా నాయుడుగారు, ప్రకాశం గారు కూడా అక్కడ పాఠశాలలోనే చేరారు. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారితో పరిచయం ఆ గోదావరి తీరంలోనే జరిగింది. గయోపాఖ్యానం, పారిజాతాపహరణ నాటకాలు నాయుడుగారు, ప్రకాశం గారి కోసమే చిలకమర్తి రాశారు. గయోపాఖ్యానంలో గయుని పాత్ర నాయుడుగారిది.గయుని భార్యగా ప్రకాశం నటించారు. కానీ నాటకాలతో ప్రకాశం చదువుకు మంగళం పాడకుండా అందుకయ్యే ఖర్చంతా నాయుడుగారే భరించేవారు. మెట్రిక్యులేషన్‌ ఇక్కడే పూర్తి చేశారు.అప్పుడే రాజమండ్రి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో చిన్న గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు ప్రకాశం. జీతం నెలకి పద్నాలుగు రూపాయలు. అంత చిన్న వయసులోనే ప్రకాశం గారి తల వంచని తత్వం ఎంతటిదో బయటపడింది.  ఆ చిన్న కొలువుకీ అర్హత పరీక్ష అన్నారు. మెట్రిక్యులేషన్‌ సర్టిఫికెట్‌ ఉండగా మళ్లీ పరీక్ష ఏమిటి, ఈ ఉద్యోగం నాకు అక్కరలేదంటూ ప్రకాశం ఆ ఆఫీసుకి ఉత్తరం రాసి పడేశారు.అందుకే కాబోలు నాయుడుగారు ప్రకాశం గారిని రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో ఎఫ్‌ఎలో చేర్పించారు. నాటక ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రౌడీ గ్యాంగ్‌లతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఆయన తొడగొట్టి అవతలి వాళ్లని చావగొట్టిన సంఘటనలు, వాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్న దుర్ఘటనలు కూడా జరిగిపోతున్నాయి. తన కంటూ ఒక గుంపును నిలబెట్టుకునే పనిలో బెస్తవాడలకి వెళ్లడం, వాళ్లు కల్లు తాగుతూ ఉంటే పక్కనే నిలబడడం వంటివి కూడా జరిగాయి. అవన్నీ ఎలా ఉన్నా తన ఆశయం – న్యాయవాది కావడం– గురించి ప్రకాశం మరచిపోలేదు. మద్రాస్‌ వెళ్లారు అందుకు. ఇదొక కొత్త అంకం. దీనికి తెర లేపిన వారు కూడా నాయుడుగారే. కొణితివాడ జమిందారు దగ్గర 90 రూపాయలు అప్పు చేసి శిష్యుడికి ఇచ్చారాయన. 1894 సంవత్సరంలో ప్రకాశం గారు రాజమండ్రి తిరిగి వచ్చి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. మంచి పేరొచ్చింది. ఆ వెనుకే  డబ్బు కూడా ఉరుకుతూ వచ్చింది. 1901లో రాజమండ్రి మున్సిపల్‌ చైర్మన్‌ కూడా అయ్యారాయన. కానీ మళ్లీ కొత్త కోరిక. చిన్న కోర్టులలో కాదు, పెద్ద కోర్టులలో, పెద్ద పెద్ద కేసులు వాదించాలి. అందుకు బారెట్లా అవ్వాలి. చాలా ప్రతిఘటనల మధ్య ఇంగ్లండ్‌ వెళ్లారు ప్రకాశం.

లండన్‌ జీవితం, బారెట్లా చదువు ప్రకాశం గారికి ఒక కొత్త ఉషోదయాన్ని చూపించాయి. అంతవరకు ఆయన జీవిత గమనంలో కానరాని కొత్త కోణమది. ఈ పురాతన దేశం తనకు పడిన సంకెళ్ల బరువు, అవి తెచ్చిపెట్టిన న్యూనత ఎంత హీనమో, ఎంత అమానుషమో ఎలుగెత్తి ఘోషిçస్తున్న క్షణాలవి. జాతిలోని ఆ ఆక్రోశానికి పోరాట రూపం ఇస్తున్న స్వాతంత్య్రోద్యమ రూపశిల్పులతో యువ ప్రకాశానికి పరిచయం కలిగింది, అక్కడే.›అప్పుడే దాదాభాయ్‌ నౌరోజీ బ్రిటిష్‌ పార్లమెంట్‌కి పోటీ చేశారు. ప్రకాశం కూడా ప్రచారంలోకి దిగారు. ఇండియా సొసైటీతో పరిచయం ఏర్పడింది. భారత స్వాతంత్య్రోద్యమానికి విదేశాల నుంచి సాయం చేయడం, ఒక తరహా పోరాటాన్ని సమన్వయం చేయడం ఈ సొసైటీ ఉద్దేశం. అదే ‘ఇండియా’ పత్రికను కూడా వెలువరించేంది. సొసైటీ తరఫున గోపాలకృష్ణ గోఖలేని పిలిచి ఉపన్యాసం ఇప్పించారు.లాలా లజపతిరాయ్‌ని కూడా ప్రకాశం అక్కడే కలుసుకున్నారు. అందుకు వేదిక అయినది – శ్యాంజీ కృష్ణవర్మ నివాసం. ఈయన గదర్‌ వీరుడు. రమేశ్‌చంద్ర దత్తు, ఉమేశ్‌ చంద్ర బెనర్జీలు కూడా ప్రకాశం గారికి అక్కడే పరిచయమయ్యారు.

 బారెట్లా పూర్తి చేసిన తరువాత ఆయన మద్రాస్‌ హైకోర్టులో చేరారు. అక్కడ వద్దని ఎందరో నిరుత్సాహపరిచినా లెక్కచేయలేదు. పని చేసే చోటుతో కాదు, ఆ పని పట్ల  ఉండే విశ్వాసం, అసలు మనిషికి ఉండవలసిన ఆత్మ విశ్వాసం విజయానికి సోపానాలవుతాయని ప్రకాశం భావించారు. అదే నిరూపించారు కూడా. న్యాయవాదిగా ఆయన ఎన్నోసార్లు న్యాయమూర్తులతో సంఘర్షణకు దిగారు. న్యాయమూర్తుల అవాంఛనీయ ధోరణులను విమర్శించడానికి ఆయన ‘లా టైమ్స్‌’ అన్న పత్రికను కూడా వెలువరించారు. భారతదేశంలో చిత్తరంజన్‌దాస్‌కు ఆరోజులలో యువతలో విశేషమైన ఆకర్షణ ఉండేది. ప్రకాశం కూడా ఆయనను ఎంతో అభిమానించారు. దగ్గరయ్యారు. ఇద్దరికీ మైత్రి ఏర్పడింది. ఒకసారి ఒక లక్షాధికారి కేసు కోసం బొంబాయి వెళ్లినప్పుడు పూనా కూడా Ðð ళ్లి బాలగంగాధర తిలక్‌ను ‘దర్శించుకుని’ వచ్చారు. అప్పుడే గోపాలకృష్ణ గోఖలే అతివాదిగా పేరొందిన తిలక్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అయినా గోఖలే పట్ల తిలక్‌ చూపుతున్న మర్యాద ప్రకాశాన్ని పరవశుడిని చేసింది. అందుకు గోఖలే స్పందన ఏవగింపు కలిగించింది. తన జీవితంలో అన్నీ ఆకస్మిక ఘటనలే అని రాసుకున్నారు ప్రకాశం. 1907లో బిపిన్‌ చంద్రపాల్‌ మద్రాస్‌ వచ్చారు. తెలుగునాట కాకినాడ మొదలుకొని మద్రాసు వరకు ఆయన సాగించిన ప్రయాణం జాతీయవాద జైత్రయాత్రగా మారిపోయింది.  మెరీనా బీచ్‌లో ఆయన సభకు అధ్యక్షత వహించడానికి అంతా భయపడుతున్న సమయంలో అప్పుడే ప్రాక్టీస్‌ ప్రారంభించిన ప్రకాశం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కడు సాహసంతో ముందుకు వచ్చారు. తరువాత హోంరూల్‌ ఉద్యమంలో అనిబిసెంట్‌ వెంట నడిచారు. 1917 నాటి కలకత్తా సభలకు గాంధీతో పాటు ప్రకాశం కూడా పాల్గొన్నారు. అప్పటికి ఆయన ఏ మాత్రం వక్త కాదని తేల్చారు ప్రకాశం. కానీ జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన కార్యక్రమాలను ప్రచురించడానికి హిందూతో సహా పత్రికలన్నీ సహకరించలేకపోయేవి. అందుకే 1921లో ప్రకాశం స్వరాజ్య పత్రికను స్థాపించారు.

1927లో సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు జరిగిన ఘట్టం ప్రకాశం అంటే ఏమిటో భారతదేశానికి తెలిసే అవకాశం ఇచ్చింది. మద్రాస్‌ నగరంలోని పారిస్‌ కార్నర్‌ దగ్గర సైమన్‌ గోబ్యాక్‌ ఉద్యమకారుల మీద కాల్పులు జరిగాయి. ఒక భారీకాయుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. అప్పుడే ప్రకాశం తెగించి ముందుకు వెళ్లారు. ‘మీరు బలవంతంగా వెళ్లదలిస్తే మేం కాల్చవలసి వస్తుంది’ అన్నాడు ఓ పోలీస్‌ ఆఫీసర్‌. అయితే అక్కడి గుంపులో ఉన్న ఒక మహమ్మదీయుడు ముందుకు వచ్చి, ‘ధైర్యం ఉంటే కాల్చు,  మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం.ఆయన ఎవరో నీకు తెలియదల్లే ఉంది.’ అన్నాడు. అక్కడితో ఆ ఆఫీసర్‌ జులం తగ్గింది. ప్రకాశం ఆ యోధుడి భౌతికకాయాన్ని చూసి, సమీపంలోనే ఉన్న మద్రాస్‌ ప్రెసిడెన్సీ చీఫ్‌ మేజిస్ట్రేట్‌ను చూడ్డానికి వెళ్లారు. తరువాత గాంధీ పిలుపుననుసరించి (చాలా విషయాల్లో ఆయనతో విభేదించినా) లక్షలు ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు ప్రకాశం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.అంతకు ముందే సెంట్రల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కి ఎన్నికయ్యారు. ఏఐసిసి కార్యదర్శి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యారు. మద్రాస్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ మత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయ్యారు. వ్యక్తి సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆయనే. కానీ అప్పటికే ఆయన తాను ఆర్జించిన సర్వం ప్రజలకు అర్పించేశారు. ఆయన దారిద్య్రం నుంచి వచ్చారు. ఈ పదవులు, ఆర్జనలు, హోదాలు ఒక భ్రమ అన్న రీతిలో తృణప్రాయంగా వదిలి పెటి మళ్లీ దారిద్య్రాన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. చినిగిన దుస్తుల్లో, చిల్లులు పడ్డ శాలువతో, తిండిలేక డస్సిపోయిన ముఖంతో విజయవాడ వీధులలో, రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనను చూసిన వారు ఆ దృశ్యాలను ఎప్పటికి మరచిపోలేకపోయారు.

తల్లి సుబ్బమ్మగారు అంతిమక్షణాలలో కొడుకును పిలిచింది. ఒక చిన్న మూటను అప్పగించింది. ఎనిమిది వందల రూపాయలున్నాయి అందులో. ఆమె కష్టార్జితం. ‘తన అంత్యక్రియలకి’ అని చెప్పారావిడ. కన్నతల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా నాకు మా అమ్మ ఇవ్వలేదు అని విలపించారాయన.   అయినా, దేశమాత రుణాన్ని ప్రకాశం గారు తీర్చుకున్న తీరు ఎప్పటికీ ఒక అద్భుతం.

16 August, 2020

శ్రీ రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి


@శ్రీనివాస్@

ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి నేడు...

శ్రీరాముడు ధర్మస్వరూపుడు. శ్రీకృష్ణుడు ధర్మ సంరక్షకుడు. శ్రీరామకృష్ణ పరమహంస సర్వధర్మస్వరూపంగా పరిగణించబడినాడు. వివేకానందుడు ఇతని ప్రియతమ శిష్యుడు.

సామాన్య పూజారిగా జీవితాన్ని మొదలు పెట్టిన ఇతను కాళీమాత ఉపాసనతో, అనుగ్రహంతో సర్వధర్మసారాన్ని ప్రపంచానికి తెలియజేసి ఆదర్శపురుషుడిగా వెలుగొందినాడు. ఈయన పేరు మీద నేడు రామకృష్ణ మిషన్ ఎన్నో ఆధ్యాత్మిక, సేవా, సాంస్కృతిక కార్య్రక్రమాలను నడుపుతూ ప్రపంచమంతా వ్యాపించింది.

ఆయన కాళిమాతకు వీరభక్తుడు. ప్రియమైన పుత్రుడు. తను పిలిచినప్పుడల్లా పలికి పరమానందానుభూతిలో ముంచెత్తే కాళీమాత ఆయన దృష్టిలో దేవత కాదు, సజీవ సత్యం. ఐతే ఈ ఆనందం కూడా ఒక బంధనమేనన్న ఆలోచన మదిలో మెదలి అంతకుమించిన జ్ఞానాన్ని పొందేదిశగా ప్రయత్నాలు చేసి, రామకృష్ణ పరమహంసగా ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచారు.

రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. చిన్ననాటినుండి చదువు, సంపాదనల మీద ఆసక్తి చూపించని రామకృష్ణులు ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిలోనే విహరిస్తూ సమయాన్ని గడిపేవారు. ఒకనాడు ఆలయంలోని కాళిమాతను చూసి ఆమె బొమ్మకాదని... తను పిలిస్తే పలుకుతుందని నిశ్చయించుకుని ఆ కాళీమాతకు పూజలు చేస్తూ అహర్నిశం అమ్మవారి ధ్యాసలోనే గడిపి అమ్మ దర్శనాన్ని పొందారు.

తోతాపురి అనే సాధువు ఉపదేశించిన అద్వైతజ్ఞానం రామకృష్ణుల జీవితాన్ని మలుపు తిప్పింది. తన భార్య శారదాదేవినే మొదటి శిష్యురాలిగా చేసుకుని తాను గురువు వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమెను సాక్షాత్తూ కాళికాదేవిలా భావించి పూజించారు. వివేకానందుడు మొదలుకుని భగవంతుడిని తెలుసుకోవాలనే తపనగల మరెందరికో తన జ్ఞానానుభావాలను పంచారు.

భగవంతుని ఆశ్రయం పొందడానికి అత్యంత ప్రేమతో సాధన చేయాలి. తనకోసం బిడ్డ అటూ ఇటూ పరుగులు పెట్టే బిడ్డను దగ్గరకు తీసుకోని తల్లి ఉంటుందా? అంటూ భక్తికి అనురాగాన్ని ముడివేసేవారు. మనస్సును సరైన దిశలో పయనింపజేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కానీ దానికి దిశానిర్దేశం చేయడంలో మన వివేకం, విజ్ఞతలను ఉపయోగించకపోతే, అదుపుతప్పిన గుర్రంలా పరుగెడుతుందనే వారి మాట ఆధ్యాత్మికానికే కాదు.... అన్నింటా అనుసంధానించవలసినది. భగవన్నామాన్ని వినడానికి లక్ష చెవులున్నా చాలవు. ఎన్నిసార్లూ ఆ నామాన్ని నోటితో జపించినా తృప్తి కగదు. ఎప్పుడైతే ఆ నామం మనసులో ప్రకంపనలను కలగజేస్తుందో అప్పుడు ఇంద్రియశుద్ధి కలుగుతుంది. కామం, అసూయలనే రెండు శత్రువులను తొలగించుకున్ననాడు భగవంతుని దర్శించడం అందరికీ సాధ్యమవుతుంది. ఇదే వారి జీవనసందేశంగా సాధకులు గ్రహించగలుగుతారు.

అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్ధంతి


@శ్రీనివాస్@

నేడు భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్ధంతి..

భారత దేశ రాజకీయ చరిత్రలోనే అటల్ బిహారీ వాజ్ పేయి రెండు సీట్ల పార్టీని అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలంగా సుస్థిరపరచుకున్న నేత. ప్రతిపక్షాల విమర్శలకు అంతే స్థాయిలో సమాధానాలు వారి చేతే శభాష్ అనిపించుకునేవారు. దాయాది దేశం పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం సమయంలో తనదైన శైలిలో మాటల తూటాలు వదిలారు. పాకిస్థాన్ దేశంలో ఓ ప్రముఖ నేత రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక చేత్తో ఏమి చేయలేరని అంటే అందుకు వాజ్ పేయి బదులిస్తూ రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయనేది నిజమే కానీ ఒక చేత్తో కనీసం చిటికెలైనా వేయొచ్చని ధీటుగా బదులిచ్చారు.

వాజ్ పేయీ మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25వ తేదీన క్రిష్ణదేవి, క్రిష్ణబిహారీ వాజ్ పేయీలకు జన్మించారు. ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయులు. దీంతో వాజ్ పేయీ ప్రాథమిక విద్య అంతా గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిరంలోనే సాగింది. అనంతరం అక్కడే విక్టోరియా కళాశాలలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అనంతరం కాన్పూర్ వెళ్లిన ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1939లో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. 1944 నుండి ఆర్ ఎస్ ఎస్ లో పూర్తి స్థాయి కార్యకర్తగా ఎదిగారు. ఆర్య సమాజ్ కు 1944లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన విభజన అల్లర్లు కారణంగా విద్యకు మధ్యలోనే స్వస్తి చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ లోని కొన్ని పత్రికల్లో పనిచేశారు. 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైమ్ లో వాజ్ పేయీ కొందరు ప్రతిపక్ష నేతలతో కలిసి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

బిజెపి అగ్రనేత అద్వానీతో కలిసి 1980లో ఏప్రిల్ 6వ తేదీన బిజెపిని స్థాపించారు. అప్పుడు తొలి అధ్యక్షుడిగా ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి రోజుల్లో రెండు సీట్లకే పరిమితం అయిన 1996 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయీ, అద్వానీలదే. అప్పట్లో తొలిసారిగా కాంగ్రెసేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అనేక నాటకీయ పరిణామాల మధ్య 1999 సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని కైవశం చేసుకున్నారు. 2000లో ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి ఫలాలే నేడు మనం అనుభవిస్తున్నాం. అవి దేశానికి ఎంతగానో మేలు చేశాయి.ఆయన హయాంలో ఇండియా సక్సెస్ గ్రోత్ ఎంతగానో మెరుగుపడింది.

ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చెప్పాల్సింది చాలానే ఉంటుంది. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రసంగాల మధ్యలో కవితల్ని కలగలపి అందరితో ఔరా అనిపించుకోవడంలో ఆయనకు ఎవరూ లేరు పోటీ.. ఆయన వాగ్ధాటిని చూసిన అప్పటి ప్రధాని నెహ్రు ఓ సందర్భంలో భవిష్యత్తులో అటల్ జీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారట.

వాజ్ పేయి తమకున్న అభిమానాన్ని బిజెపి తమదైన శైలిలో చాటుకుంది. ఆయన పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది మోడీ ప్రభుత్వం. ఆయన చేసిన సేవలను గుర్తించి 2015లో భారత రత్న అవార్డుతో సత్కరించింది. ఆయన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఇప్పటికే మన మధ్య సజీవంగానే ఉన్నాయి.

13 August, 2020

నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే

@శ్రీనివాస్@

నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

చేయి మారినా రాత మారలేదంటారు. ఎడమ చేతివాటం వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీనటులు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ చేతివాటం ఉన్న వారిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయని, ప్రత్యేక వ్యక్తులుగా వెలుగొందుతారని అంటారు.

ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ‘కుడి’ పదం వాడడం సర్వసాధారణం. కుడి చేతితో చెయ్యి, కుడికాలు పెట్టు...అన్నమాటలు తరచూ వింటుంటాం. శరీర అవయవాల్లో దేని ప్రాముఖ్యం దానిదే అయినా మనిషి జీవనం సాఫీగా సాగేందుకు ఎంతో ముఖ్యమైనవి కాళ్లు, చేతులు. ప్రయాణానికి కాళ్లు, పనులు చేసేందుకు చేతులు ప్రధానం. చేతుల్లో కుడి చేతివాటం, ఎడమ చేతివాటం వారని రెండు రకాలు. చేసేపని ఒక్కటే అయినా ఒక్కొక్కరికీ ఒక్కో చేతితో చేయడం సౌలభ్యంగా ఉంటుంది. అయితే జనాభాలో 90 శాతం మంది కుడిచేతితోనే ఏదైనా పనిచేస్తారు. మిగిలిన పది శాతం ఎడమచేతివాటం. అందుకే వారు ప్రత్యేకం. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమ చేతివాటం వారని అంచనా. ఎడమ చేతివాటం అన్నది శారీరకంగా, మానసికంగా అబ్బి న అలవాటు. కొందరు పిల్లలు అన్నిపనులు ఎడమచేతితోనే చేస్తుంటారు. ఇటువంటి వారికి తల్లిదండ్రులు కుడిచేతితో తినడం, ఇతర పనులు బలవంతంగా అలవాటు చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఇవి అబ్బవు. ముఖ్యంగా పనులు చేయడం, రాయడం వంటివి మారడం చాలా అరుదు. ఇది ఒక శారీరక, మానసిక ప్రక్రియ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

నలభై ఏళ్ల తరువాత ఎవరికైనా పిల్లలు పుడితే సాధారణంగా వారు ఎడమచేతి వాటం వారై ఉంటారని చెబుతారు. బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడు వాతావరణంలో మార్పులు కారణంగా 75 శాతం ఎడమ చేతివాటం వస్తుందని, కొన్ని సర్వేల్లో తేలింది. జన్యువులు కారణంగా ఎడమ చేతివాటం రావడానికి 25 శాతం అవకాశం ఉంది. ఎడమచేతివాటం వారు గొప్ప అదృష్టవంతులవుతారని, ప్రత్యేక గుణాలు కలిగి ఉంటారని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని, గర్వించదగ్గ విజయాలు నమోదు చేస్తారని పలుసందర్భాల్లో నిరూపితమైంది. అందుకే ఎడమ చేతి వాటానికి అంత ప్రాముఖ్యం.

ఫ్రెండ్‌షిప్‌డే, మదర్స్‌డే, ఫాదర్స్‌డే, వాలంటైన్‌ డేలా ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం (లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే) జరుపుతున్నారు. ఎడమచేతివాటం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1976 ఆగస్టు 13 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు.

ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. రాణీలక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌థావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యాకాంతం, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులు ఉన్నారు.

ఎడమచేతి వాటం వారి లక్షణాలు:
కలలు కంటారు. వాటి సాకారానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు.
స్వతంత్ర భావాలు, జ్ఞాపక శక్తి మెండు. నిత్యనూతనంగా (సృజనాత్మకత) ఆలోచనా విధానం వీరి సొంతం.
ఎంత ఒత్తిడినైనా తట్టుకునే గుణం వీరి సొంతం.
ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సత్తా ఉండడం వల్ల బహుళ లక్ష్యాల సాధనలో ప్రావీణ్యం కలిగి ఉంటారు.
చిత్రాలు గీసేటప్పుడు అవి కుడివైపు అభిముఖంగా ఉంటేటట్టు గీస్తారు. ఎడమవైపు తిరిగి ఉన్న చిత్రాలు గీయడానికి చాలా కష్టపడతారు.
బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినా కుడిచేతి వాటం వారి కంటే త్వరగా కోలుకుంటారు.
కుడిచేతివాటం వారి కోసం రూపొందించిన పరికరాల వినియోగం వల్ల ఏటా 2,500 మంది ఎడమ చేతివాటం వారు మృతి చెందుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
వీరికి అసహనం, కోపం తొందరంగా వస్తాయి.
కళ, భాష, సంగీత రంగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తారు. మొదడు, మనోవ్యాధులతో సతమతమవుతుంటారు.

 ఎడమచేతి వాటం వారి ఇక్కట్లు:
సనాతన హిందూ సంప్రదాయంలో ఏ దైవ కార్యం, శుభకార్యం తలపెట్టినా కుడిచేతితోనే చేయాలి. ఎడమ చేతితో చేస్తే అపచారంగా, తీవ్ర అశుభంగా పరిగణిస్తారు. ఎడమ చేతితో పొరపాటున అపచారం చేస్తే ఇంట్లో పెద్దలతో అక్షింతలు తప్పవు. అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో పెద్దలు, తల్లిదండ్రులు చీవాట్లు పెట్టినా రాయడం, ఇతర పనులు ఎడమ చేతితోనే చేస్తుంటారు.

శ్రీదేవి గారి జయంతి

@శ్రీనివాస్@

నేడు ప్రముఖ నటి "శ్రీదేవి" గారి జయంతి

'పూలరెక్కలు. కొన్ని తేనె చుక్కలు. రంగరిస్తవో..ఇలా బొమ్మ చేస్తివో. అసలు భూలోకం  ఇలాంటి సిరి చూసి ఉంటదా. కనక ఈ చిత్రం   స్వర్గానికి చెంది ఉంటదా?’ ఇది సీతారామశాస్త్రి గారు శ్రీదేవి గారిని గూర్చి వ్రాసిన పంక్తులు.. అందానికే అసూయ పుట్టే అందం ఆమెది.. నేడు ఆ అతిలోకసుందరి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు..

దశబ్ధాలపాటు వెండి తెరనేలిన తారా రాణి శ్రీదేవి జయంతి నేడు. ఆ అందాల నటి శ్రీదేవి ఈ ‘తెర’మరుగై ఏడాది దాటిపోతుంది. 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించారు. నాలుగేళ్ళ ప్రాయంలో శ్రీదేవి ‘కాంధన్ కరుణై’ చిత్రంతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచమయ్యారు. చక్కని రూపంతో, తక్కువ ప్రాయంలోనే అద్భుత నటన కనబరుస్తున్న శ్రీదేవి పదుల సంఖ్యలో బాలనటిగా అవకాశాలు దక్కించుకున్నారు. ఇక 1978లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ’16వయతినిలే’ చిత్రంతో మొదటిసారిగా పూర్తిస్థాయి నటిగా మారారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, రజని నటించడం విశేషం. ఇదే చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్ర రావు, ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో ఆమెతోనే తెలుగులో రీమేక్ చేయగా రెండు భాషల్లో ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది.

ఇక ఎనభై ,తొంబై దశకాలలో రెండు తరాల టాప్ హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్ఆర్,కృష్ణ, శోభన్ బాబు తోపాటు, చిరంజీవి,వెంకటేష్,నాగార్జునలతో ఈమె నటించారు. శ్రీదేవి 1994 చిరంజీవితో నటించిన ‘ఎస్పీ పరుశురాం’ తెలుగులో చివరి చిత్రం. బాలీవుడ్ లో అప్పటికే అనేక చిత్రాలు చేసిన శ్రీదేవి 1994 తరువాత హిందీ చిత్రాలకే పరిమితమయ్యారు. అద్భుత విజయాలతో టాప్ స్టార్స్ పక్కన నటిస్తూ, తిరుగులేని తారగా ఎదిగారు. బాలీవుడ్ పై ఆధిపత్యం చెలాయించిన మొదటి సౌత్ హీరోయిన్ గా శ్రీదేవి మిగిలిపోయారు.

ఇక 1996లో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ని శ్రీదేవి వివాహం చేసుకున్నారు. అప్పటికే బోని కపూర్ కి పెళ్ళై పిల్లలు ఉన్నారు. పెళ్ళైన తరువాత చిత్రాలలో నటించడం తగ్గించిన శ్రీదేవి, గతకొన్నేళ్ళుగా కధానాయిక ప్రాధాన్యం చిత్రాలలో నటిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ భాషలలో నటించిన శ్రీదేవి 300పైగా చిత్రాలలో నటించారు.ఓ వేడుకలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లిన ఆమె 2018 ఫిబ్రవరి 24న ఓ హోటల్ లోని స్నానపు గదిలో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మరణించడం జరిగింది.అయితే ఆమె మరణం పై అనేక అనుమానాలున్నాయి.

రావుగోపాలరావు గారి వర్ధంతి


@శ్రీనివాస్@

నేడు ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు "రావుగోపాలరావు" గారి వర్ధంతి

రావుగోపాలరావు (జనవరి 14, 1937 - ఆగష్టు 13, 1994)

సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?ఇలాంటి డైలాగులు వింటే మనకు రావుగోపాలరావు గారు వెంటనే గుర్తుకు వస్తారు.నేడు ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు..

ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు.
వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలని మరోసారి కొల్లగొట్టుకున్నారు.

గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.

కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో జనవరి 14, 1937 లో జన్మించారు. రావు గోపాలరావు నాటకాలను చూసి ఎస్‌.వి.రంగారావు మెచ్చుకుంటూ గుత్తా రామినీడుకి పరిచయం చేస్తే 'భక్తపోతన' చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. 'బంగారు సంకెళ్లు, మూగప్రేమ' చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసి, 'జగత్‌ కిలాడీలు' చిత్రంలో నటించి విలన్‌ అనిపించుకున్నారు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు నిర్మాతలు. బాపు దర్శకత్వంలో రూపొందిన భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్‌, చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్‌ గుర్తిండిపోతాయి. ఇదే ఊపును మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్‌ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు.విలన్‌గా, కామెడీ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా రాణించారు.

ఇతనికి 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది. ఈయన కుమారుని పేరు రావు రమేశ్. ఇతను కూడా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మగధీర,కొత్త బంగారు లోకం,గమ్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు.

రావు గోపాలరావు గారు 1994, ఆగష్టు 13 న దివంగతులయ్యారు.

పైడిమర్రి వెంకటసుబ్బారావు గారి వర్ధంతి

@శ్రీనివాస్@

విద్యార్థుల్లో దేశభక్తిని నింపుతున్న 'ప్రతిజ్ఞ' రూపశిల్పి "పైడిమర్రి వెంకటసుబ్బారావు" గారి వర్ధంతి నేడు...

బడి గంట కొట్టగానే విద్యార్థులందరూ బారులుదీరి వందేమాతర గీతం ఆలపిస్తారు.. ఆ తర్వాత ‘‘భారత దేశం నా మాతృభూమి/భారతీయులందరూ నా సహోదరులు/ నేను నా దేశమును ప్రేమించుచున్నాను...’’ అంటూ దేశంలోని ప్రతి పాఠశాలలో పిల్లలు ప్రతిజ్ఞ పూనుతారు. పసి హృదయాల్లో అణుఅణువునా దేశభక్తిని ఉప్పొంగించే ఆ ప్రతిజ్ఞ రాసింది మరెవరో కాదు నల్లగొండ జిల్లా వాసి పైడిమర్రి వెంకటసుబ్బారావు. తెలుగుతోపాటు సంస్కృతం, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ.. తొమ్మిది భాషల్లోకి అనువాదమై దేశమంతా పఠిస్తున్నారు ఆయన వ్రాసిన ఈ ‘ప్రతిజ్ఞ’...

పైడిమర్రి వెంకట సుబ్బారావు జూన్‌10, 1916న నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా నల్లగొండ జిల్లాలోనే సాగింది. ఆయనకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిషు, అరబిక్‌ భాషల్లో ప్రావీణ్యం ఉంది. హైదరాబాద్‌ ట్రెజరీ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన పైడిమర్రి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఖమ్మం, నిజామాబాద్‌, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 1962లో భారత్‌-చైనా యుద్ధం సందర్భంగా ‘తమ దేశంలోని పిల్లలందరికీ ప్రాథమిక దశ నుంచే దేశభక్తిని పెంపొందించాలని చైనా నిర్ణయించింది’. ఆ విషయాన్ని గుర్తించిన పైడిమర్రి మన దేశ బాలలందరి గుండెల్లో దేశ భక్తిని నింపాలన్న కాంక్షతో ‘భారత దేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రాశారు. ఆ రచనను చదివి ఉప్పొంగిన సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం, ఆ విషయాన్ని నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రతిజ్ఞ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అందజేశారు. ఆ తర్వాత బెంగళూరు వేదికగా జరిగిన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో దాన్ని జాతీయ ప్రతిజ్ఞగా గుర్తించారు. దేశంలోని 9 భాషల్లో అనువదించి అన్ని పాఠశాలల్లో ఆ ప్రతిజ్ఞను పిల్లలతో నిత్యం చదివించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26, 1965 నుంచి ప్రతి పాఠశాలలో విద్యార్థులతో ఆ ప్రతిజ్ఞ చేయించడం అధికారికంగా మొదలైంది.

పైడిమర్రి వెంకటసుబ్బారావు తన 18వ ఏట ‘కాలభైరవుడు’ నవల రాశారు. ‘దేవదత్తుడు’, ‘తులసీదాసు’, ‘త్యాగరాజు’ మొదలైన పద్యకావ్యాలు రచించారు. ‘బ్రహ్మచర్యం’ వంటి పలు నాటకాలతోపాటు వెట్టిచాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి. ‘గోలకొండ’, ‘సుజాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆనందవాణి’ తదితర పతిక్రల్లో పైడిమర్రి రచనలు ప్రచురితమయ్యాయి. 1945లోనే ‘ఉషస్సు కథలు’ సంపుటిని రచించి తొలి తరం కథారచయితగా నిలిచారు. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ అన్ని భారతీయ భాషల్లో అనువాదమైనా.. ఆయనకు రావలసిన గుర్తింపు రాకపోవడం  గమనార్హం.

31 July, 2020

షహీద్ ఉదమ్ సింగ్ గారి వర్ధంతి

🌹🇮🇳నేడు స్వాతంత్ర్య యోధులు "షహీద్ ఉదమ్ సింగ్" గారి వర్ధంతి🇮🇳🌹

👉షహీద్‌… ఈ పేరు కూడా తెలియని వారు మనలో చాలా మందే ఉంటారు. అణగారిన వర్గాల నుంచి వెలుగులోకి వచ్చిన ఎవరికీ పెద్దగా గుర్తింపు లభించలేదన్నదానికి షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌ జీవితమే నిదర్శనం. సిక్కుల ఆ రోజు సిక్కుల పర్వదినం బైసాఖి… హిందువుల పండుగ రామ నవమి… రెండు పర్వదినాలు ఒకే రోజు వచ్చాయి. ఈ రోజున ఓ పార్కులో బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ముస్లీం సోదరులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. నేతల ప్రసంగాలు వింటున్నారు. గుండు సూది వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. ఈ సమయంలో సాయుధ పోలీసులు ఆ పార్కును చుట్టుముట్టారు. రాకపోకలు సాగించే చిన్నటి సందులో పోలీసులు నిలబడ్డారు. అత్యాధునికమైన మెషిన్‌ గన్స్‌ తో రెడీగా ఉన్నారు. ఈ పోలీసుల నాయకుడు ముందుకొచ్చాడు. వచ్చిరావడంతోనే ‘ఫైర్‌’ అంటూ ఉన్మాదిలా అరిచాడు. ఇంకేముంది పోలీసుల చేతిలో ఉన్న మెషిన్‌ గన్స్‌ గర్జించాయి. మొత్తం 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. దీనితో సభలో పాల్గొన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏమైందో తెలుసుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రాణాలు రక్షించుకుందామనుకుని తలో దిక్కుకు పరుగులు తీశారు. అక్కడనే ఉన్న బావిలోకి దూకారు. దాదాపు పది నిమిషాల లోపు దాదాపు వేయి మంది నేలకొరిగారు. మరో 1500 మందిదాక తీవ్రంగా గాయపడ్డారు. బావి నుండి సుమారు 120 మంది మృతదేహాలు బయటపడ్డాయి. పవిత్ర పండుగ దినాన మృత్యుఘోష దద్ధరిల్లింది. అత్యంత హేయమైన ఈ సంఘటన భారతదేశంలోని పంజాబ్‌ లోని ‘జలియన్‌ వాలాబాగ్‌’లో చోటు చేసుకుంది. భరత జాతి గుండెకైన ఈ పెను గాయం ఎప్పటికీ మాననంత తీవ్రమైంది. యావత్తు భారతదేశమే దిగ్భ్రాంతికి లోనైంది. మాటలకందని విషాదం..కాల్పులు జరిపింది ఎవరో కాదు బ్రిటీష్‌ సైనికులు ఫైర్‌ అంటూ కాల్పులకు ఉసిగొల్పిన పోలీసు అధికారి బ్రిగేడియర్‌ జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌. మరొకడు పంజాబ్‌ రాష్ట్ర లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖెల్‌ ఓడ్వయెర్‌. దీనిపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో 1920లో బ్రిటీష్‌ ప్రభుత్వం కంటి తడుపు చర్యగా జనరల్‌ డయ్యర్‌ ను తొలగించింది. కానీ లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖేల్‌ను ప్రమోషన్‌పై సొంత దేశానికి పిలిపించుకుని తన నిజస్వరూపాన్ని బైట పెట్టుకుంది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశాడో ఓ కుర్రాడు. అతడికి 11 ఏళ్లు ఉంటాయి. సమావేశానికి వచ్చే వారికి మంచినీళ్లు అందించాడు. తరువాత జరిగిన ఘోరాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. భరతమాతకీ జై… అంటూ నేలకొరుగుతున్న వారిని చూసి చలించిపోయాడు. దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నారో అతడికి అర్థమైంది. బ్రిటీష్‌ పాలకులపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. చిన్ని పిడికెడు గుండెలో కడలిని వీరావేశం ఉప్పొంగింది. తనకు జన్మనిచ్చిచన భరతమాత రుణం తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఒకటి కాదు రెండు కాదు 21 ఏళ్లు నిరీక్షించాడు. తనవారిని దారుణంగా కాల్చి చంపిన దుష్టుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖేల్‌ ఓడ్వయెర్‌ను కాల్చిచంపాడు. ఇతడిని ఎక్కడ చంపాడని అనుకుంటున్నారా? వాడి దేశంలోనే వాడి ప్రజల మధ్య కాల్చి చంపాడు. కన్న భూమి రుణం తీర్చుకున్నాడు ఈ విప్లవ ధీరుడు… అతడే. షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌. అనంతరం అరెస్టు అయిన షహీద్‌ లండన్‌ కోర్టులో హాజరు పరిచారు. నా దేశ ప్రజల ఆంకాంక్షను అణిచివేసిన నరహంతకుడిని మట్టుబెట్టాను… ఈ పరాయి పాలన నా దేశానికి శాపంలా మారింది… ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది… వందేమాతరం… దేశం కోసం ప్రాణాలివ్వడానికి భయపడను… గర్వపడుతా అంటూ గర్జించాడు. ఉరికొయ్యలను ముద్దాడాడు. దేశమాత దాస్యశృంఖలాల విచ్ఛేదం కోసం ప్రాణాలర్పించిన ఎందరో తాగ్యధనుల మహోన్నత చరిత్రలో షహీద్‌ ఓ ఉజ్వల తార. తాను ఏం చేసినా, ఏ ప్రాంతంలో ఉన్నా తన ముందున్న లక్ష్యం ఏమిటో షహీద్‌ ఉద్ధం సింగ్‌కు తెలుసు. తన చిన్న తనంలో జరిగిన జలియన్‌ వాలాబాగ్‌ దురంతం, అప్పుడు జరిగిన మారణహోమం మాత్రం మర్చిపోలేడు. తాను నిర్దారించుకున్న లక్ష్యం ఆయన మనసులో స్పష్టంగా ఉంది. తన ప్రజల ఊచకోతకు కారకుడైన నరహంతక మైఖేల్‌ ఓడ్వయెర్‌ను ఎలాగైనా దునుమాడాలి. తన దేశానికి జరిగిన తీవ్ర పరాభవమానాలకు ప్రతీకారం జరగాలి. ఇదీ తన అత్యంత రహస్య ఎజెండా. కానీ తన లక్ష్యం నెరవేరేదెలా? 1940, మార్చి13న తన సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తను ఎవరినైతై లక్ష్యంగా పెట్టుకున్నాడో అతనిప్పుడు తన స్వదేశమైన ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. అతడ్ని హతమార్చడం అనుకున్నంత సులభం కాదు. అయితే సులభం కాక పోయినా అసాధ్యం మాత్రం కాదని షహీద్‌కు తెలుసు. తను లక్షంగా పెట్టుకున్న శత్రువు లండన్‌లోని క్యాక్సటన్‌ హాలులో ఒక ముఖ్యమైన సమావేశానికి వస్తున్నాడన్న కచ్ఛితమైన సమాచారం అందింది. మైఖేల్‌ ఓడ్వయర్‌ ఈస్టిండియా అసోసియేషన్‌, సెంట్రల్‌ ఏషియన్‌ సొసైటీల సంయుక్త సమావేశంలో ముఖ్య ఉపన్యాసకుడు. వెంటనే షహీద్‌ ఉద్ధం సింగ్‌ అచ్చం బ్రిటీష్‌ దేశస్థుడిలా సూటూ, బూటూ, టోపీతో తయారై సమావేశం జరగనున్న భవనానికి చేరుకున్నాడు. ప్రవేశ ద్వారం వద్ద తనిఖీ కోసం ఉద్ధం సింగ్‌ను గార్డ్‌ ఆపాడు. అతని చేతిలోని పుస్తకాన్ని తీసుకుని అటూ ఇటు తిప్పి సరిగ్గా చూడకుండానే తిరిగి ఇచ్చేశాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. ఆ పుస్తకంలోనే షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌ ఆయుధమైన రివాల్వర్‌ను దాచాడు. బైటకు అదేం కన్పించకుండా గంభీరంగా పుస్తకం. అదే ఆయుధం తీసుకుని వేటాడే పులిలా లోనికి వెళ్ళాడు. సమావేశంలో మైఖేల్‌ ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. ఇండియాలో వేయి మంది భారతీయ శత్రువులను పది నిమిషాల్లోనే ఖతం చేశా… అవసరమైతే ఆ పంజాబ్‌ జలియన్‌ వాలాబాగ్‌ లాంటి ఘటనను ఆఫ్రికాలో కూడా రిపీట్‌ చేస్తాను అని మైఖేల్‌ పేర్కొన్నాడు. అది విన్న ఉద్దం సింగ్‌ వేడి రక్తం ఉప్పొగింది. ఒక్క క్షణం అలస్యం చేయకుండా ముందుకు కదిలాడు. నీకు ఆ అవకాశం మరోసారి ఇవ్వన్రా అంటూ ఉద్దం సింగ్‌ సూటిగా ఓడ్వయర్‌ పైకి రివాల్వర్‌తో కాల్చాడు. మూడు, నాలుగు బుల్లెట్లు ఓడ్వయర్‌ శరీరాన్ని తూట్లు పొడిచాయి. అక్కడికక్కడే కుప్పకూలాడు ఓడ్వయర్‌. బ్రిటీష్‌ అధికారి మైఖేల్‌ ఓడ్వయర్‌ దారుణ హత్య వార్త క్షణంలో ఇంగ్లాండ్‌తో పాటు ప్రపంచమంతా వ్యాపించింది. ఇంగ్లండ్‌ ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఒక ముఖ్య ఉన్నతాధికారిని కాపాడుకోలేకపోవడం సాటి దేశాల ముందు తల తీసేసినట్టయింది. బ్రిటీష్‌ ప్రభుత్వం అవమాన భారంతో తల దించుకుంది. జలియన్‌ వాలాబాగ్‌ హత్యాకాండకు ప్రతీకారంగానే ఓడ్వయర్‌ హత్య జరిగిందని జర్మన్‌ ప్రోపగండా మిషన్‌ అన్ని విషయాలను కుండ బద్దలు కొట్టింది. భారతీయుల బతుకులను బుగ్గి చేస్తున్న బ్రిటీష్‌ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిచ్చేందుకే దుర్మార్గుడైన ఓడ్వయర్‌ను కాల్చి చంపానని ఉద్ధం సింగ్‌ కోర్టులో ప్రకటించాడు. నాకు ప్రాణభిక్ష అవసరం లేదు… నేను దేశం కోసం జీవితాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను… రక్తం తాగే జలగల్లాంటి సామ్రజ్యవాదులైన మీరు నాదేశం నుంచి వెళ్ళిపొండి… మా దేశ ప్రజలకు స్వేచ్ఛనూ, నిజమైన జీవితాన్నీ ఇవ్వండి… అని ఉద్ధం సింగ్‌ పేర్కొన్నాడు. కుల, మత, వర్గ విభేదాలు సృష్టించి విభజించు – పాలించు అన్న సిద్ధాంతాన్ని అనుసరిస్తన్నారే… అందుకే నేను నా పేరును రామ్‌ మహ్మద్‌ సింగ్‌ ఆజాద్‌గా మార్చుకున్నాను… అని ప్రకటించాడు. నేనిప్పుడు నేలకొరిగినా వేలాది మంది భారతీయులు అగ్నికీలలై ఉవ్వెత్తున లేస్తారు. అని గర్జించాడు… నేను ఇంగ్లీషు కూలీలకు, రైతులకు, కార్మకులకు వ్యతిరేకం కాదు… సామ్రాజ్య వాద శక్తులు మాత్రమే నాకు శత్రువులు… అని తన వర్గదృక్పథాన్ని చాటుకున్నాడు. 1940, జులై 31 ధైర్య సాహసానికి, త్యాగ దీక్షకు ప్రతీక అయిన భరతమాత ముద్దు బిడ్డ నేలకొరిగాడు. ఇంగ్లండ్‌ జైలులోనే ఉద్ధం సింగ్‌ను ఉరితీసింది బ్రిటీష్‌ ప్రభుత్వం. ఈ మహాత్యాగం 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమానికి ముఖ్య భూమిక అయ్యింది. 1919లో బ్రిటీష్‌ ప్రభుత్వం రౌలత్‌ చట్టం తెచ్చింది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా నిరవధికంగా అంటే ఇంత గడువని లేకుండా ఎమర్జెన్సీ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నిజానికి బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా నిరోధించడమే ఈ కొత్త చట్టం. ఈ చట్టంపై మహాత్మాగాంధీ వ్యతిరేకత తెలిపాడు. ఆయన పిలుపునందుకుని దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. పంజాబ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులైన డాక్టర్‌ సత్యపాల్‌, డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ చట్టాన్ని తిరస్కరించాలని ప్రజలకు ఉద్భోదించారు. వలస ప్రభుత్వం ఈ ఇద్దరి నేతలను అక్రమంగా నిర్భంధించింది. పోలీసులు వారిని రహస్య ప్రదేశానికి తరలించారు. దానితో పెల్లుబికిన ప్రజాగ్రహ ఫలితమే జలియన్‌ వాలాబాగ్‌ సమావేశం. రౌలత్‌ చట్టాన్ని గౌరవించబోమని ముక్తంకంఠంతో నినదించారు. బ్రిటీష్‌ సర్కారుపై, చట్టాలపై తిరగబడితే పట్టబోయే గతేంటో చాటాలనుకుంది. అందుకోసం కరడుగట్టిన పోలీసు అధికారులను రంగంలోకి దింపింది. ప్రజల ఊచకోత ద్వారా దేశంలో భయాందోళనలు సృష్టించాలనుకుంది. జలియన్‌ వాలాబాగ్‌ దుర్గటన వెనుక ఉన్న మర్మమిదే. షహీద్‌ ఉద్ధం సింగ్‌ దళిత సిక్కు కుటుంబంలో జన్మించాడు. అమృత్‌సర్‌కు 200 మైళ్ల దూరంలోని సునమ్‌ అనే గ్రామంలో పుట్టిన ఉద్ధం నిజంగా సునామీనే సృష్టించాడు. తండ్రి సర్దార్‌ తెహసిల్‌ సింగ్‌ రైల్వే క్రాసింగ్‌ వాచ్‌మెన్‌. ఉద్ధం చిన్నతనంలోనే తల్లి మరణించింది. ఆ తరువాత తన ఇద్దరు పిల్లలైన ఉద్ధం సింగ్‌, సాధూ సింగ్‌ను అనాధాశ్రమంలో చేర్పించాడు. తరువాత తండ్రి కూడా గతించడంతో ఉద్ధం అనాధ అయ్యాడు. స్వతంత్ర సమరంలో చెరగని ముద్ర వేసిన ఉద్ధం సింగ్‌ నివసించిన ఇల్లు సునమ్‌ గ్రామంలో ఇంకా ఉంది. దేశ స్వాత్రంత్యం కోసం ఉద్యమాలు పలు మార్గాల్లో కొనసాగుతున్నాయి. కొందరు శాంతియుత మార్గాన్ని ఎంచుకుంటే మరికొందరు విప్లవ మార్గాన్ని అనుసరించారు. మార్గాలు వేరైనా అందరి లక్ష్యం ఒక్కటే బ్రిటీష్‌ వలస పాలనకు చరమగీతం పాడడం. అయితే విప్లవ పోరాటాల ద్వారా మాత్రమే దేశానికి స్వాతంత్య్రం వస్తుందన్న భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఉద్ధం సింగ్‌ లాంటి వారిని వలస ప్రభుత్వం… భారత దేశ తొలితరం మార్క్సిస్టులుగా అభివర్ణించింది. ఉగ్రవాదులుగా ముద్రవేసింది. అమృత్సర్‌ సిక్కుల పవిత్ర నగరం. ఇక్కడే జాతీయ భావాలు వంటబట్టించుకున్నాడు. ధైర్య సాహసాలు, త్యాగనిరతి, క్రమ శిక్షణ వంటి జీవితపు మహత్తర విలువలు వంటబట్టించుకున్నాడు. 1919లో ఈ నగరమే దేశమంతటా స్వాతంత్య్ర కాంక్షను, జాతీయ భావాలను ప్రజ్వరిల్ల జేసింది. ఆ సమయంలో రౌలత్‌ చట్టం రావటంతో అప్పటికే నరనరాన దేశ భక్తి జీర్ణించుకున్న ఉద్ధం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాడు. రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగే ఆందోళనల్లో పాల్గొన్నాడు. తీవ్రవాద మార్గం ఎంచుకున్న ఉద్ధం సింగ్‌ గదర్‌ సంస్ధలో సభ్యుడయ్యాడు. ఈ విప్లవ సంస్ధను సోహాన్‌ సింగ్‌ భక్నా స్ధాపించాడు. భగత్‌ సింగ్‌ రాజగురూ వంటి వారిని తన రాజకీయ గురువులుగా చేసుకున్నాడు. విప్లవ కార్యకలాపాలు కొనసాగించే కాలంలో తన ఉనికి ఎవరికీ తెలియకుండా రకరకాల వేషాలు మార్చాడు. పేర్లూ మార్చాడు. షేర్‌ సింగ్‌, ఉదాన్‌ సింగ్‌, ఉదే సింగ్‌, ఫ్రాంక్‌ బ్రెజిల్‌, వంటి అనేక పేర్లతో ఉద్ధం సింగ్‌ కొనసాగాడు. ఒక సందర్భంలో దేశంలోని మూడు ముఖ్య మతాలకు చిహ్నంగా తన పేరును రామ్‌ మహ్మద్‌ సింగ్‌ ఆజాద్‌ అని ప్రకటించుకున్నాడు. 1924లో ఉద్ధం అమెరికా వెళ్ళడానికి అతనికున్న నేపథ్యం దృష్ట్యా పాస్‌ పోర్టు వంటి అనుమతి పత్రాలు ఎలా లభించాయన్నది ఇప్పటికీ చిదంబర రహస్యమే. బ్రిటీష రహస్య నివేదిక ప్రకారం ఉద్ధం మొదట ఇటలీ చేరుకుని, అక్కడ్నుంచి ఫ్రాన్స్‌, స్వాట్జర్లాండ్‌, ఆఫ్రికా మీదుగా ఇంగ్లాండ్‌ చేరుకున్నాడు. అక్కడే రహస్య జీవితం గడుపుతూ మైఖెల్‌ ఓడ్వయెర్‌ను కాల్పిచంపాడు. ఉద్ధం చేసిన త్యాగం మహా ఉద్యమానికే ఊపిరి అయ్యింది.

💟💟💟💟💟💟💟💟💟💟

మహమ్మద్ రఫీ గారి వర్ధంతి



24 July, 2020

సర్ ఆర్థర్ కాటన్ గారి వర్ధంతి


@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹నేడు "సర్ ఆర్థర్ కాటన్" గారి వర్ధంతి🌹

👉ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి మహానుభావులలో ఒకరైన సర్ ఆర్థర్ కాటన్ గారి వర్ధంతి సందర్భముగా వారి కృషి, దీక్ష, మానవత్వము గురించిన కొన్ని విశేషములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో…

👉సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మా నుంచి సముద్రం మీద వచ్చేస్తున్నారు. చీకటి పడింది, చల్లటి గాలి వేస్తోంది. ఆ ఓడ యొక్క పై భాగం మీదకి ఎక్కి కూర్చున్నారు. కూర్చుని ఆకాశం వంక చూస్తున్నారు. ఆకాసంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి, మధ్యలో చంద్రబింబం వెలుగుతోంది. ఆయనకు ఆకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది – “నేను ఒక చిన్న ఆనకట్ట కడితేనే చాలా గొప్ప అనుకుంటానే, అలాంటిది ఇన్ని నక్షత్రాలు, చంద్రుడు, నదులు, సముద్రాలు, మన శరీరము, బుద్ది ఇన్నిటిని సృష్టించిన పరమేశ్వరుడికి మనము ఏమివ్వగాలము? ఆయన సంతోషించేలా బ్రతకాలి…భగవంతుడు సంతోషించేలా బ్రతకడమంటే మనిషిలా బ్రతకడమే. అంటే నా కోసము, నా సంతోషము కోసము మాత్రమే బ్రతుకకుండా, ఎవరు కష్టంలో ఉన్నా ఆదుకోవటానికి నేను వెళ్ళటమే…” అంతే, అది కాటన్ జీవితాన్ని మార్చేసింది. గబగబా ఓడ క్రిందకు వెళ్లి, తన మత పవిత్ర గంథాన్ని తీసుకుని చదువుకున్నారు. ఇక అక్కడనుంచి కాటన్ జీవితాన్ని చూస్తే, ఎక్కడ ఎవరు ఆపదలో ఉంటె అక్కడకు వెళ్ళేవారు.@శ్రీనివాస్@

👉ఒకప్పుడు విశాఖపట్నంలో కాటన్ తిరుగుతున్నారు. తుఫాను వాతావరణం. కొబ్బరి బొండాలు, అరటిపళ్ళ గెలలతో ఒక మాదిరి ఓడ అక్కడకు వచ్చింది. కొంత మంది దొంగలు ఒక గుంపుగా ఆ ఓడ చుట్టూ చేరి కర్రలు పట్టుకుని కేరింతలు కొడుతూ ఆ ఓడలోని వారిని అదిలిస్తున్నారు. ఆ చిన్న ఓడ కెరటాలకు, రాళ్ళకు కొట్టుకుని బద్దలైపోతే, అందులో ఉన్న మనుషులు చల్లా చదర అయ్యిపోతే, ఆ కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు దోంగాలించచ్చు అని వాళ్ళ ఆలోచన. ఇంత పశుత్వముతో సాటి మనుషులు ఒడ్డున దిగటానికి లేక భయపడుతుంటే, వాళ్ళని కర్రలతో అదిలించి, బొండాలు, పళ్ళు ఎత్తుకుపోవటానికి చూస్తున్నారు…ఈరోజు వీళ్ళని నియంత్రించి, ఓడలోని వారికి సహాయము చేసి భగవంతుడు సంతోషించేలా జీవిస్తాను అని అనుకుని, కాటన్ ఒక దుడ్డు కర్రతో ఒక్కడే వాళ్ళందరిని అదిలించటం మొదలు పెట్టారు. ఒడ్డున ఒక మనిషి ఆసరా దొరకటముతో ఓడలోని వారంతా కూడా ధైర్యము గా కేకలు వేసి ఆ దొంగలని అదిలించి, వాళ్ళని అక్కడనుంచి పారిపోయేలా చేసారు. ఓడలోని వారంతా కాటన్ ని అభినందించి, కృతఙ్ఞతలు తెలిపినా తాను పొంగిపోకుండా, భగవంతుడు సంతోషించేలా జీవించానని ఆనందించారు.@శ్రీనివాస్@

👉ఆ తరువాతి కాలంలో ఈ దేశములోని రైతులు సంతోషించాలని ఆయాన పొందిన పరివేదన, ఆనక్కట్టలు కట్టటానికి పడిన కష్టము అనన్య సామాన్యము. ఒకప్పుడు ఆయన కోనసీమలో గోదావరి నది మీదనుంచి పడవలో వెళ్తున్నారు. ఒక ఒడ్డున దిగి నడిచి వెళ్తున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనము చేస్తూ “కాటన్ ఋషయేనమః” అని నమస్కారము చేసారు. ఇది విన్న కాటన్ కి తన పేరు తప్ప ఏమి అర్థము కాలేదు. అక్కడ ఉన్న ఇంకొక ఆయన్ని పిలిచి, ఆయన ఏమంటున్నారు అని అడిగారు. మీరే కాటన్ అని ఆయనకు తెలియదు కానీ మీకే ఆయన నమస్కారము చేస్తున్నారు. ఆశ్చర్యపోయిన కాటన్ ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి ఎందుకలా చేసారు అని అడిగారు. దానికి ఆ బ్రాహ్మణుడు “ఋషి అంటే ఎవరు? లోకము యొక్క క్షేమము కోసం తపించేవారు. ఇక్కడున్న రైతుల కోసము ఇంత కష్టపడి, గోదావరి మీద ఆనకట్ట కట్టి, ఇన్ని లక్షల ఎకరాలు సాగు అవ్వటానికి కారణము అయిన మీరు నా దృష్టిలో ఒక ఋషి. అందుకే మీకు కూడా నమస్కారము చేస్తూ సంధ్యావందనములో ఈ మంత్రము చెప్పాను” అన్నారు.@శ్రీనివాస్@

👉దానికి కాటన్ “ఈ దేశ ప్రజలకు ఎంత సంస్కారము! ఎంత కృతఙ్ఞతా లక్షణము!” అని సర్ ఆర్థర్ కాటన్ ఎంతో ఆనందించారు. మనిషికి ఇవ్వటములో ఒక గొప్ప సంతోషము ఉంటుంది. అందుకే “the hands that give are holier than the lips that pray”. ఇచ్చే చేతులు అంత పవిత్రము. ఒకరి కంటి నీరు తుడవటము కోసం ముందుకు వచ్చిన చెయ్యి, ఓదార్చటానికి చేసిన ప్రయత్నము, తన చుట్టూ ఉన్న వారికి ఉపకారము చెయ్యాలన్న తాపత్రయము మనిషిని మనిషిగా నిలబెడుతుంది. అలా బ్రతికిన వారెవరో,అట్టి మనుషులే మహానీయులౌతారు…..@శ్రీనివాస్@

💟💟💟💟💟💟💟💟💟💟

గుర్రం జాషువా గారి వర్ధంతి


@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹✍️నేడు "గుర్రం జాషువా" గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు✍️🌹

👉గుర్రం జాషువా తెలుగు సాహితీ పూతోటలో విర బూసిన సాహితీ సుగంధ పుష్పం. ఆయన పేరు వింటేనే మల్లెలు పరిమళాల్ని వెదజల్లుతాయి. కవి త్వమే ఆయుధంగా మూఢాచారా లపై తిరగబడ్డ మహా కవి. సంఘ సంస్కరణ ఆయన కావ్యలక్షణం. వర్గసంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాలు, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన ఈ అభ్యుదయవాది 1895 సెప్టెంబర్‌ 28న వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. జాషువ వినుకొండలో ప్రైమరీ స్కూల్లో చేరారు. స్కూల్‌లో చేరిన ప్పటి నుండి అంటరానితనం జాషువాను పీడించింది. ఎన్నో అవ మానాలను, కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను విను కొండలోనే విజయవంతంగా పూర్తి చేశారు. 1910లో మరియమ్మ ను వివాహం చేసుకున్నారు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వెళ్లి 1915-1916లలో అక్కడ సినిమా ప్రచారకునిగా పనిచేశారు.@శ్రీనివాస్@

👉టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువ్ఞతూపోవ డమే సినిమా ప్రచారకుని పని. ఆ తర్వాత గుంటూరులో లూథ రన్‌ చర్చి నడుపుతున్నప్పుడు ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపా ధ్యాయుడిగా పది సంవత్స రాలు పనిచేశారు. ఇలా ఉపాధ్యాయ వృత్తిని మొదలుపెట్టినప్పటి నుండి అంటే చిన్నతనం నుండి జాషువాకు సాహిత్యం, కవిత్వా లపై ఎక్కువ మక్కువ ఉండేది.@శ్రీనివాస్@

👉అలాగే సృజనాత్మకశక్తి కూడా ఉండేది. బొమ్మలు గీయడం, పాట లు పాడటం చేసేవారు. బాల్య స్నేహితుడు, ఆ తర్వాతి కాలంలో రచయిత అయిన దోపాలపిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలోఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. సాహిత్యం ఉన్నతవర్గాలకు పరిమిత మైన ఆ రోజుల్లోనే జాషువ తమ కులాల, జాతులపై జరిగిన దాడులను, వివక్షత లను జీవన సంఘర్షణలను, దుర్బరబతుకుల వేదనను అక్షర రూపంలో అసలు సిసలైన కవిత్వాన్ని సాహిత్యాన్ని సృష్టించారు. ఛాందసభావాల సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి ఆధునిక భావాలకు, అట్టడుగు వర్గాల గాధలకు పట్టంకట్టి తెలుగు సాహితీకళామతల్లికి అక్షరనీరాజనం అర్పించాడు ఈ కవి.@శ్రీనివాస్@

👉తరతరాలుగా అగ్రవర్ణాలవారు దళితులపై దండయాత్ర చేస్తూ వారిని వెలిబాటలకు బలిచేస్తుంటే ఆయన చలించిపోయా రు. దళితులను నలుగురిలో కించపరుస్తూ, వంచించి అవమాన పరుస్తుంటే ఆ మహాకవి తట్టుకోలేకపోయారు. ఆవేదనాభరితమైన హృదయంతో పద్యమై, పద్యార్థమై గర్జించి తన దళిత ధిక్కార స్వర ప్రభంజనం వినిపించారు. అలాగే ఒక పక్క అంటరానితనం ఆర్థిక అసమానతలు, వర్ణ,కుల, వ్యవస్థలతో సమాజం విలయ తాండవం చేస్తుంటే ఇంకా దోపిడీ వర్గాలు అసమాన తలను పెంచి పోషిస్తుంటే వాట న్నింటిని చూసి చలించి ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు, వేలు వ్యయింతురుకాని దుఃఖితమతులైన పేదల పకీరుల పాత్రలలో మెతుకు విదల్చరని నిలదీసిన సాంఘిక విప్లవ కారుడు. ఇలా మానవీయ దృక్పథానికి అద్దం పట్టే పద్యాలు లెక్క కు మిన్నగా రాశారు.అలాగే దళిత స్పృహతో అద్భుతమైన పద్యా లు రాశారు.@శ్రీనివాస్@

👉ఆయన రాసిన కావ్యాల్లో గబ్బిలం ఓ అత్యద్భు తమైన గొప్ప కావ్యంగా అభివర్ణించవచ్చు. అంటరానికులాన్ని, ఒక దళితుణ్ణి కథానాయకుడిగా చేసి గబ్బిలం కావ్యాన్ని రాసి సంచల నం సృష్టించారు. కథానాయకుడు తన గోడును కాశీనాధునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే ఈ కావ్యం కథాం శం.మహాపురుషులు జన్మించిన ఈ భారతావని కర్మభూమిలో దళితుడికి గుడిలోకి ప్రవేశం లేదు. కానీ గబ్బిలానికి ఉందంటూ, దళితుల దయనీయ పరిస్థితి గురించి చెప్తూ ఈ కావ్యంలో వర్ణిం చడం మనసున్న ఏ మనిషినైనా తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఈ కావ్యం ఆనాటి దళితుల జీవన విధానానికి అద్దం పడుతుంది.@శ్రీనివాస్@

👉ఈ కథలో కన్పించే దృశ్యాలన్ని కూడా ఆనాటి చారిత్రక, సామాజిక స్థితిగతుల్ని, ఎంతో హృదయవిదారకంగా మన కళ్లముందుంచారు. ఇంత గొప్ప కావ్యాలు రాస్తూకూడా ఆయన రెండు రకాలుగా వివ క్షకు గురయ్యారు. సమాజంలో ఒక పౌరునిగా వివక్షకు గురయ్యా రు. ఒక కవిగా ఆయనకుండేటటువంటి ఖ్యాతిని కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ గుర్తించడానికి ఆనాటి సమకాలీన సాటికవ్ఞలు, పండితులు కూడా ఆయన్ని దరిచేరనివ్వలేదు.@శ్రీనివాస్@

👉ఈ విధంగా ఇటు కవిగా, అటు పౌరునిగా వ్యక్తిగా కూడా రెండు రకాల వివక్షల్ని ఎదురించి పోరాడి ఎన్నో అష్టకష్టాలుపడ్డారు. పేదరికంలో పుట్టి పేదల ఆకలిబాధలను చవిచూశారు. కనుకనే కళ్లకు కట్టినట్లుగా, కంటతడి పెట్టేవిధంగా రాయగలిగారు. జాషువా కావ్యాలన్నింటా సామాజిక చైతన్యం తొణికిసలాడుతుంది. ఆయన రాసిన మరో అందమైన అద్భుత కావ్యం కొత్తలోకం కావ్యం. ఈ కావ్యం ఎన్నో మరెన్నో సరికొత్త ఆలోచనల్ని రేకెత్తించింది.@శ్రీనివాస్@

👉ఒక కొత్త సాంఘిక వ్యవస్థకోసం ఆయనపడ్డ తపన, ఒక సరికొత్త మార్పుకోసం ఆయన కన్న కలలు, సాంఘిక, సామాజిక చైతన్యంకోసం ఆయన పడ్డ తపస్సు ఈ కొత్తలోకం కావ్యంలోని ప్రతిపద్యపాదంలో ఎంతో గొప్పగా స్పూరించింది. ఆయన రచనావ్యాసాంగంతోపాటు అనేక కీలక పదవ్ఞల్ని కూడా చేపట్టారు. రెండవ ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధప్రచారకుడిగా పనిచేశారు. అలాగే మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు.@శ్రీనివాస్@

👉ఇంకా 1964లో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో సభ్యత్వం కూడా లభించింది. సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు లెక్కకు మిన్నగా బిరుదుల్ని కైవసం చేసుకున్నారు. 1970లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1970లోనే భారతప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. నవయుగ కవి చక్రవర్తి దళిత చైతన్య కవితాదీప్తి గుర్రంజాషువా 1971 జులై 24న గుంటూరులో పరమపదించారు.@శ్రీనివాస్@

💟💟💟💟💟💟💟💟💟💟

01 April, 2020

AP: G.O.Ms.No.26 Dated: 31.03.2020

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

👉GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT

👉Finance Department - Disaster Management Act, 2005 – COVID-19 Pandemic –
Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions – Deferment of
payment – Orders – Issued.
--------------------------------------------------------------------------------------------------------------------------------
FINANCE (TFR) DEPARTMENT

👉G.O.Ms.No.26 Dated: 31.03.2020

 👉Read the following:-
 1. The Disaster Management Act, 2005
 2. MHA, GoI Order No.40-3/2020-DM-I(A), dated 24.3.2020.
 3. G.O.Rt.No.216, Health Medical & Family Welfare (B2) Department,
dated:24.03.2020.

💟💟💟💟💟💟💟💟💟💟



14 January, 2020

జంధ్యాల

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹🎞️🎥"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం" అని చెప్పిన హాస్య బ్రహ్మ "జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు🎥🎞️🌹

👉జంధ్యాల పుట్టింది మకర సంక్రాంతి పర్వదినమైన జనవరి 14, 1951న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో. తండ్రి నారాయణమూర్తి ఆంధ్రరాష్ట్రానికి ‘బుష్‌’ రేడియోలకు పంపిణీదారుడుగా వుండేవారు. జంధ్యాల తల్లి సూర్యకాంతమ్మ. తల్లిదండ్రులకు జంధ్యాల ఒక్కడే సంతానం. చదువుసంధ్యలు విజయవాడ మాంటిస్సొరి హైస్కూలులో, ఆపైన ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రభుత్వ కళాశాలలో పూర్తయ్యాయి. తండ్రి నుంచే జంధ్యాలకు కళ, సాంస్కృతిక రంగాలపట్ల అనురక్తి కలిగింది. స్కూలులోను, కాలేజీలోను నాటకాల్లో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు అందుకున్నాడు. అంతర్‌ కళాశాల నాటకపోటీలలో ప్రదర్శించిన ‘ప్రేమాయణం’ నాటికలో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా బహుమతి లభించింది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పత్రికలకు కథలు రాసి చిరు పారితోషికాలు కూడా అందుకున్న ఘనుడు. స్కూలు ఫైనల్‌ చదువుతుండగా ‘ఆత్మాహుతి’ అనే నాటకం రాశాడు. అదే జంధ్యాల తొలిరచన. రెండవ రచన ‘బహుకృత వేషం’. జంధ్యాల రాసిన’ ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ నాటిక బహుళ ప్రజాదరణ చూరగొంది. ఇతర భాషల్లోకి అనువదించబడి పదివేలకుపైగా ప్రదర్శనకు, పదిహేనుసార్లు పునర్ముద్రణకు నోచుకుంది. తరవాత రాసిన ‘జీవనజ్యోతి’, ‘ఆత్మాహుతి’, ‘డాక్టర్‌ సదాశివం’, ‘మరీచిక’, ‘మండోదరి మహిళామండలి’, ‘ఓ చీకటి రాత్రి’, ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటికలు ప్రేక్షకుల హర్షద్వానాలను అందుకున్నాయి. పరిషత్తు ప్రదర్శనల్లో బహుమతులు కొల్లగొట్టాయి. గుమ్మడి వెంకటేశ్వరరావు జంధ్యాల రచించి ప్రదర్శించిన ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటక ప్రదర్శన చూసి ప్రశంసిస్తూ, మద్రాసు కళాసాగర్‌ సంస్థ తరఫున ‘కలైవానర్‌ అరంగం’లో ప్రదర్శించే అవకాశాన్నికల్పించారు. ఆ నాటకానికి హాజరైన ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్‌.రెడ్డి తను తీయబోయే సినిమా రచనకు ఆహ్వానించారు. అయితే దురదృష్టం కొద్దీ బి.ఎన్‌.రెడ్డి చనిపోవడంతో నిరుత్సాహపడుతున్న జంధ్యాలను దర్శకుడు కె.విశ్వనాథ్‌ భుజంతట్టి నైతిక మద్దతు ప్రకటించారు. అలా 1976లో లక్ష్మి ఫిలిం ఆర్ట్స్‌ సంస్థ అధిపతి హనుమాన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రానికి మాటలు సమకూర్చారు. రెండవ సినిమా ‘పెళ్లి కాని పెళ్లి’. నాటకాలు రాసిన అనుభవం, చిలకమర్తి, కందుకూరి, పానుగంటి, భమిడిపాటి వారు రచించిన హాస్యరచనలు చదవడం వలన అవి జంధ్యాల హాస్యం వైపు కాస్త మొగ్గుచూపేందుకు చాలా ఉపకరించాయి. కేవలం ఐదేళ్లలోనే దాదాపు ఎనభై సినిమాలకు సంభాషణలు రాసి రికార్డు సృష్టించాడు జంధ్యాల. 1976లో చింతా రామకృష్ణారెడ్డి గీతాకృష్ణా కంబైన్స్‌ పతాకంమీద ‘సిరిసిరిమువ్వ’ చిత్రాన్ని నిర్మించినప్పుడు, దర్శకుడు కె.విశ్వనాథ్‌ జంధ్యాలకు సంభాషణలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో రచయితగా జంధ్యాల స్థిరపడ్డారు. వేటూరి పాటలు, జంధ్యాల మాటలు కలబోసిన చిత్రాలు బాక్సాఫీసు హిట్లను ఎన్నింటినో తెలుగు ప్రేక్షకులకు పంచాయి. వాటిలో ముందు చెప్పుకోవలసిన సినిమా 1977 ఎన్టీఆర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం ‘అడవిరాముడు’. ఆ చిత్రానికి జంధ్యాల సంభాషణలు రాసి తిరుగులేని రచయితగా పేరుతెచ్చుకున్నాడు. ఆ చిత్రం 32 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో 365 రోజులు, 8 కేంద్రాల్లో రెండువందల రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు ఆడి నాలుగు కోట్ల వసూళ్లు రాబట్టింది. 1978లో కృష్ణ సినిమా ‘బుర్రిపాలెం బుల్లోడు’కి, 1979లో ‘తాయారమ్మ బంగారయ్య’ హిట్‌ సినిమాలకు జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘శంకరాభరణం’ (1979) చిత్రానికి జంధ్యాల రాసిన సంభాషణలు అద్భుతంగా అమరాయి. అలతి పదాలతో అనంతార్ధాలు పంచిన సంభాషణలు ఆ సినిమాలో కోకొల్లలు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సప్తపది’ చిత్రానికి కూడా జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు. తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘వేటగాడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘రౌడీరాముడు-కొంటెకృష్ణుడు’, ‘అమరదీపం’, ‘భలేకృష్ణుడు’, ‘ఆఖరిపోరాటం’ ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శుభోదయం’, ‘సీతామాలక్ష్మి’, ‘సాగరసంగమం’ ‘ఆపద్బాంధవుడు’, ‘స్వాతికిరణం’; సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘సొమ్మొకడిది-సోకొకడిది’, ‘ఆదిత్య369’, కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’, ‘విజేత’ వంటి విజయవంతమైన చిత్రాలకు మాటలు సమకూర్చారు. సినీ రచయితగా 1977-86 మధ్యకాలంలో జంధ్యాల అలా క్లాస్‌ని, మాస్‌ని అలరిస్తూ సుమారు రెండు వందల సినిమాలకు పైగా పనిచేశారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉నిర్మాత కానూరి రంజిత్‌ కుమార్‌ 1981లో నటనాలయ సంస్థ పేరుతో నిర్మించ తలపెట్టిన ‘ముద్దమందారం’ సినిమా కోసం జంధ్యాలకు దర్శకత్వం చేసే అవకాశాన్ని కలిపించారు. ఆ టీనేజి లవ్‌ స్టోరీకి జంధ్యాల తొలిసారి రచన, దర్శకత్వ బాధ్యలు నిర్వహించారు. రచయితగా మంచి పేరుతెచ్చుకుంటున్న సమయంలో దర్శకత్వం ఎంచుకోవడం జోడెడ్ల మీద సవారి అని స్నేహితులు వారించారు. అయితే దర్శకత్వం మీద మమకారం వున్న జంధ్యాల ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. కొత్తవాళ్ళతో ప్రయోగానికి సిద్ధపడ్డారు. తను రాసిన ‘ఓ చీకటి రాత్రి’ నాటక ప్రదర్శన చూసి అందులో అద్భుత నటన ప్రదర్శించిన ప్రదీప్‌ కుమార్‌ని హీరోగా తీసుకున్నారు. హీరోయిన్‌గా మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన పూర్ణిమను ఎంపిక చేశారు. వైజాగ్‌ నావల్‌ యార్డులో పనిచేస్తున్న సుత్తి వేలును హాస్యనటుడిగా వెండితెరకు పరిచయం చేశారు జంధ్యాల. తన రంగస్థల గురువు విన్నకోట రామన్న పంతులుకి మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమాలో జంధ్యాల డబ్బింగ్‌ కూడా చెప్పడం విశేషం. అధికభాగం సినిమా విశాఖపట్నం లోనే తయారైంది. రమేష్‌ నాయుడు సంగీతం అద్భుతంగా అమరిన ఈ చిత్రం 11 సెప్టెంబరున విడుదలై 25 కేంద్రాల్లో విజయవంతంగా ఆడి శతదినోత్సవం చేసుకుంది. అలా తొలి ప్రయత్నంలోనే జంధ్యాల దర్శకునిగా జయకేతనం ఎగురవేశాడు. నూతన నటవర్గంతో ప్రయోగాత్మకంగా లఘు బడ్జెట్‌ చిత్రాలు నిర్మించి మంచి ఫలితాలు రాబట్టిన దర్శకులలో జంధ్యాల పేరు ముందుంటుంది. రెండవ ప్రయత్నంగా జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘మల్లెపందిరి’. చల్లా వెంకట్రామయ్య నిర్మించిన ఈ చిత్రంలో విజ్జిబాబుని హీరోగా పరిచయం చేశారు. ‘తూర్పువెళ్లేరైలు’ ఫేమ్‌ జ్యోతి హీరోయిన్‌గా నటించగా ‘షేక్‌ మోజెస్‌’గా గాయకుడు బాలు, మరో పాత్రలో గేయ రచయిత వేటూరి అతిథి పాత్రలు పోషించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉‘మల్లెపందిరి’ వచ్చిన నెల రోజుల గ్యాప్‌తో విడుదలైన జంధ్యాల చిత్రం ‘నాలుగు స్తంబాలాట’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నవతా కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రంలో రెండు జంటలుగా నరేష్‌-పూర్ణిమ, ప్రదీప్‌-తులసి నటించారు. నరేష్‌కి హీరోగా ఇదే తొలి చిత్రం. ఇందులో వీరభద్రరావు, వేలు చేత ‘సుత్తి’ అనే పదప్రయోగం చేయించి వారిని ‘సుత్తిజంట’గా పాపులర్‌ చేసిన ఘనత జంధ్యాలది. సినిమాలో వీరి కామెడీ ట్రాక్‌ని రికార్డుగా విడుదల చేశారు. నరేష్‌కు బాలు డబ్బింగ్‌ చెప్పారు. ఇ.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రంతోనే జంధ్యాలవద్ద దర్శకత్వ శాఖలో చేరారు. ఈ సినిమా ఎనిమిది కేంద్రాల్లో వందరోజులు ఆడింది. హైదరాబాద్‌ దేవి థియేటర్లో 175రోజులు ఆడి శతదినోత్సవం జరుపుకున్న తొలిచిత్రం ఇదే. వరసగా మూడు ప్రేమకథా చిత్రాలను విజయవంతం చేసిన జంధ్యాల, నాలుగో ప్రయత్నంలో తన ట్రాక్‌ మార్చి ‘మతంకన్నా మానవత్వం మిన్న’ అనే సందేశమిచ్చే ‘నెలవంక’ (1983) చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ద్వారా రాజేష్, కిరణ్‌ అనే ఇద్దరు నటులను జంధ్యాల వెండితెరకు పరిచయం చేశారు. రాజేష్‌ పాతతరం హీరో అమరనాథ్‌ కుమారుడు. ఇందులో పాటలన్నీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మతో రాయించడం విశేషం. అయితే ఈ చిత్రం ఫ్లాపయింది. ముళ్లపూడి రమణ సృష్టించిన ‘రెండుజెళ్ళ సీత’ (1983) పేరుతో శ్రీభ్రమరాంబికా ఫిలిమ్స్‌ వారికి జంధ్యాల ఒక చిత్రం చేసిపెట్టారు. ఇందులో నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్‌ నలుగు కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. సీనియర్‌ నటి పుష్పలత కూతురు మహాలక్ష్మిని హీరోయిన్‌గా తొలిసారి పరిచయం చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించాలని విజయశాంతి, భానుప్రియ, శోభన సెలక్షన్లకు వచ్చారు. కానీ అవకాశం రాలేదు. ఇందులో హాస్యనటిగా నటించిన శ్రీలక్ష్మి పాతతరం నాయకుడు అమరనాథ్‌ కూతురే. సినిమా బాగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. జంధ్యాల అక్కినేనితో ‘అమరజీవి’ అనే ఒకేఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విజయానికి దరిచేరలేదు. తరువాత చంద్రమోహన్‌-రాధిక జంటగా ‘మూడుముళ్ళు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈనాడు పత్రికాధినేత రామోజీరావు జంధ్యాల దర్శకత్వంలో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రాన్ని నిర్మించారు. వారి సంస్థ వెలువరించే ‘చతుర’లో వచ్చిన పొత్తూరి విజయలక్ష్మి నవల ‘ప్రేమలేఖ’ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నరేష్‌-పూర్ణిమ జంటగా నటించారు. 1984లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందభైరవి’ చిత్రాన్ని మరో ‘శంకరాభరణం’గా భావించవచ్చు. పరకాయప్రవేశ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మరో జంధ్యాల సినిమా ‘రావూగోపాల్రావూ’. 1985లో నరేష్‌-పూర్ణిమ జంటగా జంధ్యాల ‘పుత్తడిబొమ్మ’ నిర్మించారు. కార్టూనిస్టు జయదేవ్‌ సీరీస్‌ ‘బాబాయ్‌-అబ్బాయ్‌’ ఆధారంగా సుత్తి వీరభద్రరావు-బాలకృష్ణలతో జంధ్యాల మరో చిత్రాన్ని సృష్టించారు. మరో జంధ్యాల చిత్రం ‘శ్రీవారి శోభనం’లో నరేష్‌కు జంటగా అనితారెడ్డి నటించింది. ఆ తరువాత భానుప్రియ-నరేష్‌ జంటగా జంధ్యాల దర్శకత్వం నిర్వహించిన చిత్రం ‘మొగుడూ-పెళ్ళాలూ’. ‘బామ్మగారి మనవరాలు’ చిత్రంతో భానుమతిని బామ్మపాత్రలో నటింపజేసిన జంధ్యాల విజయవంతమయ్యారు. ఇక రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్‌లతో నిర్మించిన ఓ తమాషా ప్రేమకథ ‘రెండురెళ్ళు ఆరు’ చిత్రం బాగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. యువచిత్ర నిర్మాత మురారి జంధ్యాల దర్శకత్వంలో ‘సీతారామకల్యాణం’ (1988) చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా నిర్మించారు. ఈ చిత్రం 14కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. యాక్షన్‌ హీరోగా ముద్రపడిన చిరంజీవిని విభిన్న కోణంలో చూపిస్తూ ఆయనచేత చార్లీ చాప్లిన్‌ను పోలిన హాస్యపాత్రను పోషింపజేసిన సినిమా ‘చంటబ్బాయ్‌’.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉అమెరికా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు వారితో ఒక సినిమా తీసేందుకు జంధ్యాల ప్లాన్‌ చేశారు. అదే ‘పడమటి సంధ్యారాగం’. తెలుగు తెరమీద హాస్యానికి మహారాజయోగం పట్టించిన రామానాయుడు-జంధ్యాలల సినిమా ‘అహ నా పెళ్ళంట’. రాజేంద్రప్రసాద్‌ హీరోగా అద్భుత హాస్యాన్ని అందించాడు. జంధ్యాల తరువాతి కాలంలో నిర్మించిన ‘చిన్నికృష్ణుడు’ చిత్రానికి బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.డి.బర్మన్‌ సంగీతం సమకూర్చడం విశేషం. రాజేంద్రప్రసాద్‌తో నిర్మించిన ‘వివాహ భోజనంబు’లో బాలు పోలీసు ఇనస్పెక్టర్‌గా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ‘నీకు నాకు పెళ్ళంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘హై హై నాయకా’, ’జయమ్ము నిశ్చయమ్మురా’, ‘లేడీస్‌ స్పెషల్‌’, ‘బావా బావా పన్నీరు’, ‘బాబాయ్‌ హోటల్‌’, ‘ప్రేమా జిందాబాద్‌’ వంటి జంధ్యాల సినిమాలు బాగానే ఆడాయి. మొత్తంమీద జంధ్యాల 350 సినిమాలకు రచన చేసి 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟

సి డి దేశ్ ముఖ్

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹జనవరి 14, "సి.డి.దేశ్‌ముఖ్" గారి జయంతి సందర్భంగా  కొన్ని విషయాలు🌹

👉సి.డి.దేశ్‌ముఖ్ (జనవరి 14, 1896 - అక్టోబరు 2, 1982) పూర్తి పేరు చింతామణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ (Chintaman Dwarakanath Deshmukh). వీరు భారతీయ రిజర్వ్ బాంక్ మూడవ గవర్నర్ మరియు స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్.ఇతడు 1943, ఆగష్టు 11 నుంచి 1949, జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులైనాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁జననం🍁

👉1896, జనవరి 14 న జన్మించాడు. 1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్ ఇంగ్లాండులో నివసిస్తుంది.ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన దుర్గాబాయి దేశ్‌ముఖ్ను వివాహం చేసుకున్నాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన దేశ్‌ముఖ్ కు 1939 నుంచే రిజర్వ్ బ్యాంక్ తో సంబంధం ఉంది. 1941లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాధ్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. జూలై 1944లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అతడు కూడా భారత దేశం తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (International Monetary Fund-IMF) మరియు ప్రపంచ బ్యాంకు (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. 1950లో పారిస్లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁అవార్డులు🍁

👉1952లో దేశ్‌ముఖ్ విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయపు జేసస్ కళాశాల నుంచి గౌరవ ఫెలోగా ఎన్నికయ్యడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1959లో ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగ్సేసే అవార్డును పిలిప్పీన్స్కు చెందిన జోస్ అగ్విలార్ తో కల్సి సంయుక్తంగా పొందినాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1975లో భారత ప్రభుత్వం చే పద్మ విభూషణ పురస్కారం పొందినాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁మరణం🍁

👉1982, అక్టోబరు 2న మరణించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟

న్యాపతి సుబ్బారావు

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹జనవరి 14, "ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు" గారి జయంతి సందర్భంగా.... 🌹

👉ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 - జనవరి 15, 1941) స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు మరియు రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁బాల్యం, విద్యాభ్యాసం🍁

👉సుబ్బారావు 1856వ సంవత్సరం జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది. బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా కోస్తా జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, ది హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁రాజమండ్రిలో 🍁

👉ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించాడు. రాజమండ్రిలో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంతో సన్నిహితంగా మెలగేవాడు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించాడు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1885లో రాజమండ్రి పురపాలకసంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. *ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగాడు. 1896లో ఆయన రాజమండ్రిలోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రిక్‌ సప్లై కార్పొరేషన్‌ను స్థాపించి, విద్యుదుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్‌ను సరఫరా చేసి వెలుగులు నింపాడు. *1893లో ఆయన రాజమండ్రిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు ఆందుబాటులోకి తెచ్చాడు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం పంతులు ఎడిటర్‌గా వ్యవహరించాడు. రచయితల్ని ఆర్థికంగా ప్రోత్సహించటం లక్ష్యంగా సుబ్బారావు పంతులు నవలారచన అంశంగా వివిధ పోటీలు నిర్వహించేవాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనా వ్యాసంగానికి సుబ్బారావు నైతికంగా, ఆర్థికంగా ఎంతో సహకరించాడు. అదేవిధంగా హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసును రాజమండ్రి, పరిసర ప్రాంతాలకు పరిచయం చేసినది కూడా ఈయనే.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1922 ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధనా సంస్థ (ఇప్పుడు రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలగా ఉన్నది) ఏర్పాటును న్యాపతి సుబ్బారావు పంతులు ఎంతగానో ప్రోత్సహించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1897, ఫిబ్రవరి11న స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారతదేశం తిరిగివస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్రబృందం ఆయన్ను ఆహ్వానించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పురజనులు హాజరైన ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి న్యాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు. వివేకానందుడు మద్రాసు రేవులో దిగగానే పూలమాల వేసి ఆహ్వానించిన తొలివ్యక్తి సుబ్బారావే. ఆ మరుసటి రోజు విక్టోరియా హాల్లో వివేకానందునికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు.ఫిబ్రవరి14న మెరీనా బీచ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వివేకానందునితో పాటు సుబ్బారావు పంతులు వేదికను అలంకరించాడు. అలా ప్రారంభమైన వీరి స్నేహం సుబ్బారావుపై గాఢమైన ప్రభావాన్ని వేసింది. 1903లో వివేకానందుని స్ఫూర్తితో, సుబ్బారావు రాజమండ్రిలో భగవద్గీత మరియు సనాతన హిందూధర్మ ప్రచారానికై, హిందూ సమాజం అనే సంస్థను స్థాపించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1898 నుంచి 1917 వరకూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన కీలకమైన భూమికను పోషించాడు. 1907లో వందేమాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్‌ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించాడు. విజయవాడలో 1914 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపునిచ్చాడు. 1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్‌ మేరకు ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ను అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడయ్యాడు. అంతేగాక ఆయన అఖిలభారత కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలందించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉సుబ్బారావు పంతులు 1941, జనవరి 15వ తేదీన మరణించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟