Followers

31 July, 2018

RAINBOW


🌈ప్రశ్న: ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది?🌈

👉జవాబు: వాతావరణంలో మిగిలిన కాలాల కన్నా వర్షాకాలంలో నీటి ఆవిరి పెద్ద పెద్ద బిందువుల రూపంలో ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే ధవళకాంతి ఆ నీటి బిందువుల గుండా వెళ్లేప్పుడు గాలిని, నీటిపొరను వేరుచేసే అంతరోపరితలం(interface) వద్ద వక్రీభవనం (refraction)చెందుతుంది. ఇలా వక్రీభవనం చెందే కోణాలు వివిధ తరంగదైర్ఘ్యాల (wavelengths)కు వేర్వేరుగా ఉండడం వల్ల ధవళకాంతిలోని వివిధ కాంతి తరంగాలు ఏడు రంగులుగా విడిపోతాయి. ఇలా విసిన కర్రలాగా విస్తరించుకున్న సప్తవర్ణాలు, ఆ బిందువు అవతలివైపున ఉండే అంతరోపరితలం వద్ద అంతర్గత సంపూర్ణ పరావర్తనం (Total Internal Reflection) చెంది మన కంటిని చేరుతాయి. కాబట్టి ఇంద్రధనుస్సు మన కంటిలోనే ఏర్పడుతుంది కానీ, ఆకాశంలో కాదు. అందుకే హరివిల్లనేది మిధ్యాబింబం(virtual image). దాని వల్ల లాభనష్టాల సమస్య లేదు. కాబట్టి ప్రకృతి కల్పించే ఆ అందమైన దృశ్యాన్ని ఆనందంగా చూడ్డమే.

💟💟💟💟💟💟💟💟💟💟

No comments:

Post a Comment