@శ్రీనివాస్@
👉ఏకీకృత సర్వీసురూల్స్ అంటే...👈
👉జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఎంపికయిన ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉపాధ్యా యులకు పదోన్నతుల విషయంలో ఒకే సర్వీసు రూల్స్‌ను అమలుచేసే విధానమే ఏకీకృత సర్వీసు రూల్స్. ఈ నిబంధనలపై ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్ల మధ్య వివాదం 1998 నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ యాజమాన్యం కింద ఉన్న పాఠశాలల్లో పనిచేసే వారిని ప్రభుత్వ టీచర్లగానూ, మండల, జిల్లాపరిషత్తుల పరిధిలో గల పాఠశాలల్లో పనిచేసే వారిని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులుగా గుర్తించారు. 1994 వరకు ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్ల నియామకాలు వేర్వేరుగా జరిగేవి. 1995నుంచి అన్ని పాఠశాలలకు ఒకే విధం గా డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలను జరుపుతున్నారు. 371డీ అధికరణం ప్రకారం తమకే పదోన్నతులు ముందుగా ఇవ్వాలని పంచాయతీరాజ్ టీచర్లకు అర్హత లేదని ప్రభుత్వ టీచర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏకీకృత సర్వీసురూల్స్ అంశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
No comments:
Post a Comment