@🇸🇷🇪🇪🇳🇮🇻🇦🇸@
🌹తెలుగు అక్షరానికి గౌరవాన్ని తెచ్చిన అక్షర శిల్పి "డా.సి.నారయణ రెడ్డి" గారి జయంతి నేడు.. ఆ సరస్వతీ పుత్రున్ని గుర్తు చేసుకుంటూ..🌹
👉తెలుగు సినిమా పాటను పరిపుష్టం చేసిన కవుల్లో సి. నారాయణరెడ్డి ఒకరు. ఆయన కలానికి అన్ని వైపులా పదునే. ప్రణయ గీతాలు… ప్రబోధ గీతాలు…భావ గీతాలు…. భావోద్వేగ గీతాలు.. భక్తిగీతాలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో ఆణిముత్యాలు కళామతల్లి కంఠహారంలో కవితా కుసుమాలుగా పొదిగారు సినారే.
👉ఈ సాహితీ సార్వభౌముడు సృజించని సాహితీ ప్రక్రియ లేదు. గజల్స్ నుంచి గేయాలదాకా .. ఆయన చేయని ప్రయోగంలేదు. జనహితం.. సామాజిక ప్రయోజనం ఆయన పాటల్లో పల్లవిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. జనపథాలను పాటకట్టిన మేటికవి సినారే.@శ్రీనివాస్@
👉కరీంనగర్ జిల్లా హన్మజీపేటలో 1931 జూన్ ఇరవై తొమ్మిదిన జన్మించారు సి. నారాయణరెడ్డి. ఉర్దూ మీడియంలోనే చదవుకున్నారు. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. చిన్నప్పటి నుంచి రచనలపై మక్కువ చూపేవారు సినారె.
👉ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు. సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు అందుకున్నారు.@శ్రీనివాస్@
👉ఎన్టీఆర్ హీరోగా 1962లో విడుదలైన గుళేబకావళి కథ చిత్రంతో ఆయన సినీరంగంలోకి ప్రవేశించారు. అంతేకాదు తొలి సినిమాలోనే అన్ని పాటలు రాసిన తొలి రచయితగా అరుదైన గౌరవం సాధించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని నన్నుదోచుకుందువటే పాట తెలుగు సినిమా బతికున్నంతకాలం నిలిచే ఉంటుంది అనటం అతిశయోక్తి కాదు.
👉సి.నా.రే.. రాసిన పాటల్లో ఫలానా పాటే బావుందని అనటానకి మనసొప్పుకోదు. ఎందుకంటే ఆయన రాసిన ప్రతి పాట ఓ ఆణిముత్యమే. కాని ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహమో లేక కాలం అలా కలిసి వచ్చిందో కాని సినారే గారు ఎక్కువగా ఎన్టీఆర్‌గారికే పాటలు రాశారు. ఆయన ఎన్టీఆర్ కి రాసిన అన్నీ పాటలు దాదాపు హిట్టే. అంతలా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో పాటలు ఇప్పటికీ గుర్తిండిపోయాయి.@శ్రీనివాస్@
👉సి.నా.రె పాటల్లో జీవముంటుంది అక్షరాల్లో అమృతం.. భావంలో సొబగు దాగుంటుంది. అది మనసును మురిపిస్తుంది. ఎన్ని పాటలు రాసినా.. ఆ కలానికి సాహితీ దాహం తీరలేదు.. రాసిన ప్రతీ పాట సజీవంగా ఎప్పటికీ నిలిచిపోయేలా చిరస్మరణీయం చేశారు సినారే. ఎన్ఠీఆర్ తో పాటు అక్కినేని కి కూడా మంచి పాటలను రాసి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.
👉1965 తర్వాత సినారే పాటల వెల్లువ మొదలైంది. ఎన్టీఆర్, అక్కినేని, శోభన్‌బాబు, కృష్ణ ఇలా అందరు హీరోలకు అందరు దర్శకులకు ఆయన పాటలు రాశారు. రాసిన ప్రతిపాట ఎంతో సాహితీ విలువలతో పాటు.. ప్రేక్షకుడికి అర్దమయ్యే టట్టు సరళంగా రాయడం ఆయన ప్రత్యేకత.@శ్రీనివాస్@
👉నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నుండి.. జేజెమ్మా వరకూ సినారే సినీ గీతాలు సహిత్యపరిమిళాలు వెదజల్లాయి. ఆయనది అలుపెరగని సాహీతీ ప్రయాణం.. అందుకే అత్యున్నతమైన జ్జ్ఞానపీఠమెక్కారు. తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకోగలిగిన కవి సినారె. అంతేకాదు మూడు తరాలకు సాహితీవారధిగా నిలిచారు సినారె.@శ్రీనివాస్@
👉1965 తర్వాత సినారే పాటల వెల్లువ మొదలైంది. ఎన్టీఆర్, అక్కినేని, శోభన్‌బాబు, కృష్ణ ఇలా అందరు హీరోలకు అందరు దర్శకులకు ఆయన పాటలు రాశారు. సాంప్రదాయ ధోరణిలో పద్యాలు రాసారు..ఆధునిక ధోరణిలో వచన కవితలల్లారు.. లలితమైన పదాలతో గేయాలు రాసారు..తెలుగులో అందమైన గజల్లు పాడారు.. సినారె కవిత, గీతం ఎంత తీయగా వుంటాయో..సినారె గళం కూడా అంత మధురంగా వుంటుంది.@శ్రీనివాస్@
👉ఎన్నో అద్భుత గీతాలను రాసిన సినారే మాస్ మాసాల పాటలతో కూడా అలరించారు. దంచవే మేనత్త కూతురా అన్న పాట సినారే సాహిత్యం అంటే నమ్మడం కొంచెం కష్టమే. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగుపదాలు రాయటంలో సినారేది ప్రత్యేక శైలి. తెలుగు సినీకవుల్లో అమూల్య పదసంపద ఉన్న అతి కొద్ది మంది సినీ కవుల్లో సినారే అగ్రగణ్యుడు అనటం ఏమాత్రం అతిశయోక్తికాదు. పదాలలోని భావం చెడకుండా సూటిగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.@శ్రీనివాస్@
👉ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, గజళ్ళు,వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. గ్రాందిక భాషలలో భారీ సమాసాలతోనే కాదు ప్రజలు మాట్లాడుకునే వ్యవహారిక భాషలోనూ ఆయన పాటకట్టి మెప్పించారు. కంటేనే అమ్మ అని అంటే ఎలా, ఓ ముత్యాల రెమ్మ లాంటి పాటలు ఆయనలోని సినీకవిని మరింతగా తెరపై ఆవిష్కరిస్తాయి.@శ్రీనివాస్@
👉సినారె కవిత తొలిసారి జనశక్తిపత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది.@శ్రీనివాస్@
👉సినారె గ్రంధాలు చాలా భాషల్లోకి అనువందిచబడ్డాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూభాషల్లో కవితలల్లారు. 990 లోయుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు.సాహితీ పండితులతో పాటు పామరులను కూడా అలరించారు. 3,500లకు పైగా ఆణిముత్యాల్లాంటి పాటల్ని మనకందించారు సినారే. ఆయన రచించిన పాటలు తెలుగు ప్రేక్షకులు మదిలో చెరగని జ్జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. సినీ గమనంలో మైలు రాళ్లుగా నిలిచిపోయాయి.@శ్రీనివాస్@
👉ఆయన సాగించి సాహితీ సేద్యానికిగాను కళా ప్రపూర్ణ, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు ఆయన వరించి తరించాయి.. అంతేకాదు ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్జ్ఞాన్ పీఠ్ అవార్డ్ ను అందుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న రెండో తెలుగువారు సినారెనే. మరెన్నో రాష్ట్ర, జాతీయ అవార్డులు ఆయన కీర్తి కిరీటం లో చేరి తమని తాము గౌరవించుకున్నాయి.భౌతికంగా ఆయన మనల్ని వదిలివెళ్లి నా.. ఆయన రచనలు, పాటల రూపంలో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు…
💟💟💟💟💟💟💟💟💟💟
No comments:
Post a Comment