*🌴డైస్ నాన్ అంటే ఏమిటి:🌴*
♦సర్వసాధారణంగా ఉద్యోగులు సంబంధిత అధికారి నుండిఎలాంటి పుర్వానుమతి లేకుండా లేక కనీసన్ సలవు దరఖాస్తుకుడా పెట్టకుండా విధులకు గైర్హాజరవుతు ఉంటారు.ఇలాంటిసందర్భాలలో ఉద్యోగి విధులకు గైర్హాజరైన కాలాన్ని ఫండమెంటల్రూల్ ప్రకారం డైస్ నాన్ గా పరిగణిస్తారు.
♦అంటే పనిచేయలేదు కాబట్టి జీతంలేదు అని అర్ధం.ఇట్టి కాలాన్ని సర్వీసు బ్రెకుగా పరిగణించరు,కానిఅట్టి కాలాన్ని ఇంక్రిమెంటుకు గాని పెన్షనుకు గాని సెలవుకు గానిపరిగణలోకి తీసుకోరు.అంతేకాకుండా ఆ ఉద్యోగిపై సి.సి.ఎ రూల్స్ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.
♦ఉద్యోగి ఒకసంవత్సరము మించి గిర్హాజరైన సర్వీసు నుండితొలగిస్తారు(G.O.Ms.No.11 Fin Dated:13-1-2004).
♦అలాంటివక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు పరిగణిస్తారు(Rule 5B&G.O.Ms.No128 Fin Dated:1-6-2007)
♦విధులకుఅనుమతి లేకుండా గిర్హాజరైన ఉద్యోగి తిరిగి కొంతకాలం తరువాత్జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో అది తిరస్కరించటంసరికాదు.అతనిని వెంటనే విధులలో చేర్చుకోవాలి.తదుపరి తగినవిధంగా క్రమశిక్షణా చర్యలుతీసుకోవాలి(Memo.No.9101/4/8/FR-1 Fin Dated:25-12-1991)
💟💟💟💟💟💟💟💟💟
No comments:
Post a Comment