*📚ఉన్నత విద్యకై ఓ.డి సౌకర్యం కల్పించే జీవో.342:*
♦ SC/STనాన్ గజిటేడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇన్ సర్వీసులో ఉన్నత విద్యను అభ్యసించడానికి వేతనంతో కూడిన సెలవును జీవో.342 తేది:30-08-1977 ద్వారా కల్పించింది.
🍀 *OD సౌకర్యం పొందుటకు షరతులు:*
♦ కనిష్టంగా 5 సం.సర్వీసు పూర్తిచేసిన లేదా పదవీ విరమణ కాలం 3 సం.ఉన్న శాశ్వత ఉద్యోగులు అర్హులు.షెడ్యూల్ ఏరియా ST ఉపాధ్యాయులకైతే 3 సం.సర్వీసు సరిపోతుంది(జీవో.07 తేది:2-2-1993)
♦ కోర్సు తదుపరి ప్రమోషన్ కు ఉపయోగపడేదిగా ఉండాలి.
♦ కోర్సు పూర్తి అయిన పిదప 5 సం.పాటు అదే శాఖలో పనిచేస్తానని అఫిడెవిట్ ద్వారా సంబంధిత అధికారికి హామీ ఇవ్వాలి.
♦ గరిష్టంగా 2 సం.కాలం లేదా కోర్సు పూర్తయ్యే కాలం ఈ రెండిటిలో ఏది తక్కువైతే దానిని పరిగణలోకి తీసుకుని ఆన్ డ్యూటీ మంజూరుచేస్తారు.
♦ కోర్సు కాలంలో పూర్తి జీతం
చెల్లిస్తారు. ఉన్నత విద్య కోసం ఇచ్చిన డిప్యూటేషన్ కాలం ఆన్ డ్యూటీగా పరిగణించబడుతుంది కావున ఆ కాలంలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరుచేయవచ్చు.
💟💟💟💟💟💟💟💟💟
No comments:
Post a Comment