Followers

28 July, 2018

💧నీళ్లు - లెక్క💧


💦💧నీళ్లు - లెక్క💧💦

👉వర్షాకాలం వచ్చిందంటే చాలు జూరాల ప్రాజెక్టుకు కృష్ణానది నుంచి తరలి వచ్చే వరద ఎంత .. అక్కడ స్టోరేజీ చేసిన నీరెంత ఆ నీటిని ఏఏ కాల్వలకు తరలిస్తున్నారు. ఎంతమేర తరలిస్తున్నారని ప్రతినిత్యం వార్తలు వ్రాస్తూనే ఉంటం. ఇలాంటి వార్తలు వ్రాసేటపుడు మనం వాడే పదాలు క్యూసెక్కులు .. టీఎమ్సీలు.. అడుగులు మీటర్లు అని గరిష్టనీటి సామర్థ్యం.. నీటి నిల్వ అనే పదాలు వాడుతాం .. చాలా మందికి వీటికి ఉన్న ఆర్థాలు తెలుసు కానీ ఖచ్చితమైన కొలతలపై సరైన అవగహన ఉండాలనే ఉద్దేశ్యంతో చేసే ఈ చిన్న ప్రయత్నం. తెలియని వారు గ్రహిస్తారని.. తెలిసినవారు మన్నిస్తారని ఆశిస్తున్నా..
*Cusec* అంటే – క్యూబిక్ ఫీట్ పర్ సెకెండ్ అనగా ఒక సెకను కాలంలో ఒక ఘనపుటడుగు మేర ప్రాంతం నుంచి పారే వరద అని అర్థం. ఒక ఘనపుటడుగులో పట్టే నీరు లీటర్లలో లెక్కపెడితే 28.317 లీటర్లు.

👉TMC అంటే – Thousand Million Cubic Feet. అంటే వెయ్యి కోట్ల ఘనపు అడుగులలో పట్టే నీటి విలువ అంటే ఒకటి తర్వాత పది సున్నాలు పెట్టాలన్నమాట. 10000000000 x 3 అడుగుల స్థలంలో పట్టే నీరు అన్నమాట.
ఒక TMC లో ఉండే నీరెంత అని లెక్కవేస్తే.. 28316846600 లీటర్లు. అంటే 2831 కోట్లా 68 లక్షలా 46 వేలా 600 లీటర్లు.

👉ఇక TMC కి Cusec  కి అనుసంధానం చేద్దాం.
ఒక టీఎమ్సీ నీరు అంటే 2831 కోట్లా 68 లక్షలా 46 వేలా 600 లీటర్ల నీరన్నమాట ఇంతటి నీరు రావాలంటే ఎన్ని క్యూసెక్కుల నీరు ఎంత సేపు పారాలి. అనే విషయం గమనిద్దాం.
ఒక్క క్యూసెక్కులో 28.317 లీటర్ల నీరని తెలుసు. మరి ఒక క్యూసెక్కు నీరు ఒక నిమిషం పాటు ప్రవాహం ఉంటే 1699 లీటర్ల నీరు వస్తుంది. గంటకు 101940 లీటర్లు.. ఇలా ఒక్క క్యూసెక్ నీరు 24 గంటలపాటు ప్రవహిస్తే చేరే నీరు  24,46,560 లీటర్లు. అనగా ఒక టీఎమ్సీ నీరు 24 గంటల్లో రావాలంటే 11,574.2 క్యూసెక్కుల నీటి ప్రవాహం 24 గంటలపాటు ఉండాలి.

💟💟💟💟💟💟💟💟💟💟

No comments:

Post a Comment