Followers

21 August, 2018

SBI ATM CARDS



🏵SBI ATM CARDS🏵

🌻🌹ఎస్‌బీఐ ఏటీఎం వాడుతున్నారా..?🌹🌻

 🍁ఏ కార్డుకు లిమిట్ ఎంత ఉంటుందో తెలుసుకోండి..!🍁

👉మన దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు ఏవైనా వివిధ రకాల డెబిట్, ఏటీఎం కార్డులను తమ‌ కస్టమర్లకు అందిస్తాయని తెలిసిందే. వాటి ద్వారా వినియోగదారులకు అందే బెనిఫిట్స్ వేర్వేరుగా ఉంటాయి. అలాగే ఎస్‌బీఐ కూడా తన కస్టమర్లకు ఇచ్చే భిన్న రకాల ఏటీఎం, డెబిట్ కార్డులకు కూడా రోజువారీ విత్ డ్రాయల్, పర్చేస్, స్వైపింగ్‌ లిమిట్స్ వేర్వేరుగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

🍁ఎస్‌బీఐ క్లాసిక్ డెబిట్ కమ్ ఏటీఎం కార్డు🍁

👉ఈ కార్డు వాడే వారికి రోజు వారీ క్యాష్ విత్ డ్రాయల్ లిమిట్ గరిష్టంగా రూ.40వేల వరకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ కార్డు హోల్డర్లు ఈ-కామర్స్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ మిషన్, ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు, బిల్లు చెల్లింపులు జరిపితే ఈ లిమిట్ రూ.50వేల వరకు ఉంది.

🍁ఎస్‌బీఐ ప్రైడ్ డెబిట్ కమ్ ఏటీఎం కార్డు🍁

👉ఈ కార్డు కలిగిన వారు దేశంలోనే కాక విదేశాల్లోనూ నగదు విత్‌డ్రా చేస్తే రోజుకు రూ.1లక్ష వరకు లిమిట్ ఉంది. అదే ఆన్‌లైన్, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీల లిమిట్ రూ.2 లక్షల వరకు ఉంది.

🍁ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు🍁

👉ఈ కార్డు కలిగిన ఎస్‌బీఐ కస్టమర్లు రోజుకు రూ. 1 లక్ష వరకు నగదు విత్ డ్రా (డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కలిపి) చేయవచ్చు. ఆన్‌లైన్, పీవోఎస్, ఈ-కామర్స్ లావాదేవీలు అయితే రూ.2 లక్షల వరకు జరపవచ్చు.

🍁ఎస్‌బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు🍁

👉ఈ కార్డు కలిగిన ఎస్‌బీఐ కస్టమర్లు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రెండూ కలిపి రోజుకు రూ.50వేల వరకు ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లావాదేవీలు అయితే రోజుకు రూ.2 లక్షల వరకు చేయవచ్చు.

💟💟💟💟💟💟💟💟💟💟

No comments:

Post a Comment