NMMS
*💁♂ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్*
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
ఈ స్కాలర్ షిప్ ను పొందడానికి ప్రతి విద్యార్థి జూలై మాసంలో దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.
*దరఖాస్తు వివరాలు..*
• కులధ్రువీకరణ పత్రం
• ఆదాయ ధ్రువీకరణ పత్రం (విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.1.50లక్షల లోపు ఉండాలి).
• పాఠశాలలో చదువుకున్నట్లు విద్యా ధ్రువీకరణ పత్రం.
• బ్యాంకు అకౌంట్ నంబర్.
• ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
• రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.
• నవంబర్ లో జరిగే పరీక్షకు విద్యార్థులు హాజరుకావాల్సి ఉంటుంది.
ఎంపికైన విద్యార్థులకు మూడేళ్లపాటు ప్రతి సంవ త్సరం రూ.12వేల చొప్పున మొత్తం రూ.36వేలు అందజేస్తారు.
No comments:
Post a Comment