Followers

16 August, 2018

🌻🌹మౌలిక నిబంధన FR-49 ఏం చెబుతోంది:🌹🌻


🌻🌹మౌలిక నిబంధన FR-49 ఏం చెబుతోంది:🌹🌻

👉 ప్రభుత్వం ఉద్యోగిని ఒకేసారి రెండు పోస్టులలో నియమించవచ్చును.

👉 ఒక ఉద్యోగి తన బాధ్యతతో పాటు మరొక ఖాళీ పదవి నిర్వహణ బాధ్యత అప్పగించినపుడే "అదనపు చార్జి" గా పరిగణిస్తారు.కొత్తగా సృష్టించిన పోస్టులకు గాని,నాల్గవ తరగతి పోస్టులకు 'అదనపు చార్జి' వర్తించదు.

👉  అదనపు చార్జికి అదనపు వేతనం పొందాలంటే కనీసం 14 రోజుల పనిదినాలుండాలి.

👉 మొదటి 3 నెలలకు మూలవేతనం (Basic Pay) పై 1/5 వంతు వేతనము,తదుపరి 3 నెలలకు 1/10 వంతు వేతనము FAC అలవెన్స్ పేరుతో చెల్లించెదరు.

👉 మొదటి 3 నెలలకు మంజూరుచేయు అధికారం RJD లకు ఇవ్వబడింది.
C&DSE Rc.No.1827/C2/2009 తేది:25.11..2010

👉 తదుపరి 3 నెలల అలవెన్స్ C&DSE మంజూరుచేయును.

👉 6 నెలలకు మించి అదనపు వేతనాన్ని పొందటానికి అనుమతించ రాదు.
G.O.Ms.No.197 F&P తేది:04-07-1964

💟💟💟💟💟💟💟💟💟💟

No comments:

Post a Comment