Followers

04 August, 2018

🌻🌹Comprehensive Financial Management System (CFMS ) కొన్ని ప్రశ్నలు - సమాధానాలు🌹🌻

🌻🌹Comprehensive Financial Management System (CFMS )  కొన్ని ప్రశ్నలు - సమాధానాలు🌹🌻

👉1. ఆన్లైన్ విధానం ఎప్పటినుండి అమలు ?

👉జ. ఏప్రిల్ 01,2018 నుండి.

👉2. ప్రతీనెల జీతపు బిల్లులు ఏ తేదీ లోగా STO వారికి సమర్పించాలి ?

👉జ. పాత విధానంలో అనుసరించిన తేదీలనే.

👉3. ప్రింట్ తీసిన కాపీలు అవసరమా ?

👉జ. లేదు.

👉4.వేటిని ప్రింట్ తీసి pdf ద్వారా సమర్పించాలి ?

👉జ. స్పెషల్ కేస్ బిల్ కి మాత్రమే (అనగా ఇంక్రిమెంట్ , బడ్జెట్ , ఖర్చులు,ఏవైనా సర్టిఫికెట్ లు)వాటిని స్కాన్ చేయాలి.

👉5 . వేటిని ప్రింట్ తీయనక్కర్లేదు ?

👉జ. బిల్ షెడ్యూల్స్.

👉6. ఒక ఆఫీస్ లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉంటే ?

👉జ. ఒకరు మేకర్, DDO సబ్మిటర్.

👉7.ఒక ఆఫీసులో ఒక్కరే సిబ్బంది ఉంటే ?

👉జ. ఆయన DDO అయితే మేకర్,చెక్కర్,సబ్మిటర్ అన్నీ ఆయనే.

👉8.DDO అందుబాటులో లేకపోయినా, అసలు ఆ ఆఫీస్ కి DDO లేకపోయినా ?

👉జ. అదే మండలంలోని వేరే ఆఫీస్/స్కూల్ యొక్క DDO ఆదరైజేసెషన్ తీసుకోవాలి.ఎందుకంటే కేవలం DDO ల బయో మెట్రిక్ మాత్రమే బిల్లులకు  పనిజేస్తుంది.

👉9. CFMS లో స్టాఫ్ జాబితా తప్పుగా ఉంటే ?

👉జ. CFMS సైట్ లోనికి లాగ్ ఇన్ అయ్యి QUERY లో కంప్లైంట్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం పొందవచ్చు.

👉10.ఎవరినైనా ADD/DELETE చేయాలంటే ?

👉జ. అది కూడా QUERY లో సబ్మిట్ చేయవచ్చు.

👉11.పాత విధానంలో ఉండీ, ఇప్పుడు తీసేసిన కొన్ని విషయాలు ?

👉జ. TBR అక్కర్లేదు, APTC ఫారం 101 ,47 , బాంక్ ఫారం , బెనెఫిషరీ అక్కర్లేదు.

👉12.ట్రెజరీ బ్యాంక్ లు అనే పదం ఉంటుందా ?

👉జ. ఉండదు. ఇప్పుడు ఏ బ్యాంక్ లో అయినా CHALLANS కట్టవచ్చు.

👉13. తప్పుగా బిల్ పంపితే ?

👉జ. UNIQUE నెంబర్ GENERATE అయ్యాక మళ్లీ అది CANCEL చేయబడదు.తప్పుగా పంపితే మరల సబ్మిట్ చేయవచ్చు. కానీ ఇక్కడ FIFO (ముందు వచ్చినవి ముందుగా బయటికి) విధానంలో బిల్లులు ఆర్డర్ లో ఉంటాయి.

👉14.unique నెంబర్ అనగా ?

👉జ. ఇంతకు ముందు TBR లాంటిదే.కానీ ఈ సారి ఈ నెంబర్ రాష్ట్రంలో ఒక్కటే ఉంటుంది.

👉15.మేకర్, చెక్కర్,submitter లు ముగ్గురూ అవసరమా ?

👉జ. అక్కర్లేదు.కానీ సబ్మిటర్ కచ్చితంగా ఉండాలి.

👉16.ట్రెజరీ id లు ఉంటాయా ?

👉జ. ఉండవు.వీటి స్థానంలో CFMS ID లు వచ్చాయి.కానీ రెండూ అనుసంధానం చేయబడే ఉంటాయి.

👉17.ఒక్కో voucher కి ఒక బిల్లు సబ్మిట్ చేయాలా ? అన్నీ voucher లను కలిపి చేయవచ్చా ?

👉జ. ప్రస్తుతానికి ఒక voucher కి ఒక బిల్ అనే విధానం ఉంది.అలా ఎన్ని ఉంటే అన్ని బిల్లులు సమర్పించాలి.

👉18.నగదు ఎలా , ఎవరిచే చెల్లించ బడుతుంది ?

👉జ. బిల్లుకు అన్నీ సక్రమంగా ఉంటే సెంట్రల్ సర్వర్ ద్వారా E-KUBER కి జతచేసి RBI ద్వారా చెల్లించబడతాయి.15 నిమిషాల్లో బిల్ చేసి, అన్నీ PASS ON చేస్తే 16వ నిమిషంలో నగదు ఉద్యోగి యొక్క బ్యాంక్ ఖాతా కు జమ చేయబడతాయి.

👉19.ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో తప్పు ఉంటే ?

👉జ. అటువంటి పొరపాట్లు ఏమైనా జరిగితే DDO లకు మెసేజ్ లు వెంటనే వస్తాయి.

👉20.CFMS విధివిధానాలు కి HELPLINE నెంబర్ ఉందా ?

👉జ. ఉంది. వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. http://cfms.ap.gov.in

💟💟💟💟💟💟💟💟💟💟

No comments:

Post a Comment