Sreenivas:
బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం మనం ఎంతటి అవస్థలు పడతామో అందరికీ తెలిసిందే. వాటి కోసం తహసీల్దార్/మున్సిపల్ ఆఫీస్, మీ సేవ సెంటర్‌ల చుట్టూ తిరగాలి. అయినా పని అవుతుందన్న గ్యారెంటీ లేదు . దళారులను ఆశ్రయిస్తే వారు సర్టిఫికెట్ కు వేలల్లో డిమాండ్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) అనే ఓ కొత్త ప్రోగ్రామ్ ద్వారా జనన, మరణ ధృవ పత్రాలను అందిస్తోంది. అందుకు మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఎంచక్కా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మీకు కావల్సిన సర్టిఫికెట్లను పొందొచ్చు.
http://crsorgi.gov.in/web/index.php/auth/signUp అనే వెబ్ సైట్ లింక్‌ను సందర్శించి అందులో ఇచ్చిన విధంగా వివరాలను నింపితే చాలు. 15 రోజుల్లోగా మీరు దరఖాస్తు పెట్టుకున్న సర్టిఫికెట్ ఇంటికే వస్తుంది. అందుకు మీరు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు. ఈ వెబ్‌సైట్‌కే చెందిన mCRS Civil Registration System అనే ఓ ఆండ్రాయిడ్ యాప్ కూడా మనకు అందుబాటులో ఉంది. దాన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ముందు చెప్పినట్టుగా మీ వివరాలు నింపితే చాలు, దాంతో సర్టిఫికెట్ పొందొచ్చు.
పైన చెప్పిన యాప్ లేదా వెబ్‌సైట్‌లో వివరాలను నింపి, 15 రోజులు వెయిట్ చేస్తే మీకు కావల్సిన సర్టిఫికెట్ సిద్ధమవుతుంది. దాన్ని అంతకు ముందు మీరు ఇచ్చిన ఈ-మెయిల్‌కు అధికారులు పంపుతారు. లేదంటే పైన చెప్పిన వెబ్‌సైట్‌లోనే ఆ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఫింగర్ టిప్స్ తోనే అయిపోతుంది. ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. లంచాలు సమర్పించుకోవాల్సిన అగత్యం అంతకన్నా లేదు. గతేడాది డిసెంబర్ 1వ తేదీ నుంచే ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చినా చాలా మందికి తెలియదు. వీలైనంతగా షేర్ చేస్తే దీని గురించి అందరికీ తెలుస్తుంది. అప్పుడు మరింత మందికి హెల్ప్ చేసిన వారమవుతాం.
No comments:
Post a Comment