*💥ప్రతిభకు సవాలు..మేధకు పదును!*
🔹పాఠశాల నుంచే పిల్లల్లో మేధాశక్తిని మేల్కొలిపి లోతైన విషయ పరిజ్ఞానాన్ని పెంపొందింపజేయడానికి ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒలింపియాడ్స్ అత్యున్నతమైనది. ఈ పరీక్షలు ప్రాంతీయస్థాయిలో ప్రారంభమై అంతర్జాతీయ పోటీల వరకు సాగుతాయి. విద్యార్థులు శాస్త్ర రంగాల్లో వృత్తిని ఎంచుకునే విధంగా ఇందులో ప్రోత్సాహకాలు ఉంటాయి. దీని వల్ల ప్రతిభామూర్తులైన పిల్లలు ఆయా సబ్జెక్టుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడుతుంది.
*💥ఒలింపియాడ్స్*
*‘సర్! ఐఐటీకీ, ఒలింపియాడ్‌కీ¨, మ్యాథ్స్‌కూ మధ్య తేడాలు ఏంటి?’*
♦ఓ అవగాహన సదస్సులో విద్యార్థి అడిగిన ప్రశ్న ఇది.
మ్యాథ్స్, సైన్స్‌ల లాగే ఐఐటీ (జేఈఈ), ఒలింపియాడ్‌లు కూడా మన సిలబస్‌లో ఉండే సబ్జెక్టులు కావచ్చునేమోనన్న అమాయకత్వంలో నుంచి పుట్టిన ప్రశ్న ఇది.
మరీ ఈ స్థాయిలో కాకున్నా చాలామంది పాఠశాల, కళాశాలల విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ ఒలింపియాడ్ గురించి తగిన అవగాహన ఉండటం లేదు.
🔹ఒకప్పుడు 4 సంవత్సరాల పాటు జరిగే ఒలింపిక్ క్రీడల కాలవ్యవధిని ఒలింపియాడ్ అని పిలిచేవారు. విద్యా సంబంధిత విషయానికి వస్తే వివిధ అంచెల్లో ఒక సంవత్సరంపాటు, స్కూలు స్థాయి పిల్లలకు వివిధ సబ్జెక్టుల్లో నిర్వహించే ప్రతిభాన్వేషణ పరీక్షలే ఒలింపియాడ్స్.
*💥ఎన్ని ఒలింపియాడ్స్?*
♦1959లో ప్రారంభమైన ఇంటర్‌నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ (ఐఎంవో) తో పాటు సైన్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో కలిపి ఇంకా 13 ఒలింపియాడ్ పరీక్షలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జులైలో ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో (ప్రతి సబ్జెక్ట్‌కు విడిగా) జరుగుతాయి. వీటిలో-
ఇంటర్‌నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐపీహెచ్‌వో), ఇంటర్‌నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ (ఐసీహెచ్‌వో), ఇంటర్‌నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ (ఐబీవో), ఇంటర్‌నేషనల్ అస్ట్రానమీ ఒలింపియాడ్ (ఐఏవో), ఇంటర్‌నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ (ఐజేఎస్‌వో), అనేవి ప్రాచుర్యం పొందిన పరీక్షలు. ఈ పరీక్షలను అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు సంస్థలు నిర్వహిస్తాయి. అయితే వీటన్నింటినీ కలిపి ఐఎస్‌వో (ఇంటర్‌నేషనల్ సైన్స్ ఒలింపియాడ్స్) అని పిలుస్తారు.
♦ఉదాహరణగా అతిముఖ్యమైన ఐఎంవోను తీసుకొందాం! మనదేశానికి ఐఎంవోలో ప్రాతినిధ్యం వహించాలనుకున్నవారు అధిగమించాల్సిన దశలు నాలుగు.
*1) ప్రీ ఆర్‌ఎంవో:*
గత సంవత్సరం నుంచీ ఈ దశను ప్రవేశపెట్టారు. ఆర్‌ఎంవో అంటే రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్.. అంటే రాష్ట్రస్థాయి పరీక్ష. దీని కంటే ముందుగా జరిగేది కాబట్టి ఈ దశను పీఆర్‌ఎంవోగా పిలుస్తారు. ప్రతి రాష్ట్రం నుంచీ దాదాపు 300 మందిని ఎంపిక చేస్తారు. 9, 10, 11, 12 (ఈ సంవత్సరం నుంచి) తరగతులు చదివే పిల్లలు దీనికి అర్హులు. ప్రతిభావంతులైన 8వ తరగతి పిల్లలకు కూడా అనుమతి ఉంటుంది. పరీక్ష మరీ కష్టంగా ఉండదు.
*2) ఆర్‌ఎంవో:*
ఈ రాష్ట్రస్థాయి పరీక్షకు 30 మంది పిల్లలను (300 మంది నుంచి) ఎంపిక చేస్తారు. అయిదుగురు బాలికలకు ప్రత్యేక అర్హత మార్కులుంటాయి.
*3) ఐఎన్‌ఎంవో:*
(ఇండియన్ మ్యాథ్స్ ఒలింపియాడ్) అన్ని రాష్ట్రాల నుంచి ఆర్‌ఎంవో స్థాయిలో ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష స్థాయి కఠినంగా ఉంటుంది. అధిక ఐక్యూ ఉండి, మ్యాథ్స్‌లో ప్రత్యేక ప్రతిభ ఉన్న విద్యార్థులు, ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షను మెరుగ్గా రాయగలుగుతారు.
*4) ట్రైనింగ్ క్యాంప్:*
ఐఎన్‌ఎంవో నుంచి 30 మంది విద్యార్థులను (అయిదుగురు బాలికలను) ఎంపిక చేసి నెలరోజుల ప్రత్యేక తర్ఫీదును అందిస్తారు. ఈ 35 మంది విద్యార్థుల నుంచి ఆరుగురు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అవుతారు. ఈ ఆరుగురికి తిరిగి ఐఎంవో కంటే ముందుగా ఇంకొక ట్రైనింగ్ క్యాంప్‌ను నిర్వహిస్తారు.
*💥ఎవరు నిర్వహిస్తారు?*
🔹హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ) బాంబే వారు ఎన్‌బీహెచ్‌ఎమ్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్) వారి సౌజన్యంతో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. చివరి దశల్లో కేంద్రీయ మానవవనరుల మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలను అందిస్తుంది.
గమనించాల్సింది ఏమిటంటే..మ్యాథ్స్ ఒలింపియాడ్ సిలబస్‌కూ, ఐఐటీ-జేఈఈ సిలబస్‌కూ, ఐఐటీ-జేఈఈ ఫౌండేషన్‌కూ సంబంధం లేదు.
ఒలింపియాడ్‌లో ఆల్జీబ్రా, కాంబినేటరిక్స్, నంబర్ థియరీ, జామెట్రీల్లో ప్రశ్నలను సంధిస్తారు. ఒక్క పీఆర్‌ఎంవో స్థాయిలో తప్ప (ఈ స్థాయిలో 30 ప్రశ్నలుంటాయి) మిగిలిన దశల్లో 3 గంటల్లో 6 ప్రశ్నలు సాధించాల్సి ఉంటుంది. కనీసం 4 ప్రశ్నలు కరెక్ట్‌గా చేసినప్పటికీ తర్వాతి దశకు అర్హత తప్పకుండా సాధించవచ్చు.
పరీక్ష రాయాలనుకుంటే..?
♦ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ పరీక్ష రాయాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్ olympiads.hbcse.tifr.res.in లోకి వెళ్తే ప*💥ప్రతిభకు సవాలు..మేధకు పదును!*

♦ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ పరీక్ష రాయాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్ olympiads.hbcse.tifr.res.in లోకి వెళ్తే పూర్తి వివరాలు లభ్యమవుతాయి.
♦ఈ ఒలింపియాడ్ పరీక్షలు ఒక క్రమాన్ని అనుసరిస్తుంటాయి. ఇప్పుడు నడుస్తున్నది 2018-19 సైకిల్. అంటే 2019లో జరగబోయే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌కు అర్హత సాధించడానికి దాదాపు జులై 2018 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది.
🔹మ్యాథ్స్ ఒలింపియాడ్ సైకిల్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. దీనిలో మొదటి అంచె అయిన ప్రీ ఆర్‌ఎంవో దరఖాస్తు గడువు ముగిసింది. అంటే 2018-19 మ్యాథ్స్ ఒలింపియాడ్ ప్రక్రియలో ప్రవేశించే అవకాశం ఈ సంవత్సరానికి లేదు.
♦ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అస్ట్రానమీ ఒలింపియాడ్స్ మొదటి స్టేజి పరీక్ష అయిన నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎస్‌ఈ)కు వెళ్ళాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి అక్కడినుంచి ప్రాస్పెక్టస్ డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు తెలుసుకోవచ్చు.
🔹ఎన్‌ఎస్‌ఈ.. నవంబరులో జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచీ సన్నద్ధమైతే సరిపోతుంది.
*💥జాగ్రత్త సుమా..!*
♦పాఠశాల స్థాయి విద్యలో వ్యాపార పోకడలు ఎక్కువైన ప్రస్తుత తరుణంలో విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ కొన్ని సూచనలు.
🔹ఒలింపియాడ్ పేరున అనేక విద్యావ్యాపార సంస్థలు (ప్రచురణ సంస్థలు, స్కూల్స్, కోచింగ్ కేంద్రాలు, కళాశాలలు) అధికారిక పరీక్ష పేర్లను అనుకరిస్తూ పరీక్షలను నిర్వహిస్తుంటాయి. ్స ఇలాంటి పరీక్షల్లో ఆ సంస్థలు ఇచ్చే ఫేక్ ర్యాంకుల వల్లా, మెడల్స్ వల్లా ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ్స ఈ సంస్థలు అందించే మెటీరియల్స్ వల్ల గానీ, అక్కడి ఉపాధ్యాయుల వల్ల గానీ ఒలింపియాడ్ స్థాయి పరీక్షల ప్రిపరేషన్ సాధ్యం కాదు.
♦అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిగానీ, అర్హతŸ కలిగిన శిక్షకుల సలహాలూ, శిక్షణా తీసుకొని మాత్రమే ఈ దిశలో పిల్లలను నడిపించడం ఉత్తమం.
*💥పరీక్షలో ఉత్తీర్ణులయితే లాభాలు*
*1) అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్‌ను అందిస్తారు. నగదు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. తర్వాత సంవత్సరాల్లో ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉపకార వేతనాలతో అడ్మిషన్లు సాధించడానికి ఈ ఫలితాలు తోడ్పడతాయి.మ్యాథ్స్‌లో నోబెల్ ప్రైజ్‌గా భావించే ఫీల్డ్ మెడల్ సాధించేవారిలో ఐఎంవోలో విజయం సాధించినవారు చాలామంది ఉంటున్నారు.*
*2) ఐఎన్‌ఎంవో నుంచి ట్రైనింగ్ క్యాంప్‌కు ఎంపికైనవారికి సీఎంఐ, ఐఎస్‌ఐ లాంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో నేరుగా ప్రవేశం లభిస్తుంది.*
*3) ఐఎన్‌ఎంవోలో ఉత్తమ ప్రదర్శన కనబరచినవారికి (క్యాంప్‌కు ఎన్నిక కాకపోయినా) మెరిట్ సర్టిఫికెట్లు లభిస్తాయి.*
*4) ఆధునిక సమాజంలో సంక్లిష్టమైన, బాధ్యతాయుతమైన స్థానాలను నిర్వహించబోయే భావి నాయకులకు చిన్నతనంలోనే సమస్యా సాధన అనే సంస్కారం ఈ ఒలింపియాడ్స్‌కు సిద్ధమవడం వల్ల సమకూరుతుంది..చివరివరకూ పోటీలో నిలవలేక పోయినా!*
*5)మ్యాథ్స్ ఒలింపియాడ్ సిలబస్ భిన్నమైనదే. అయినప్పటికీ ఇంటర్/ 12వ తరగతి తర్వాత రాసే ఐఐటీ-జేఈఈ, గ్రాడ్యుయేషన్ తర్వాత రాసే క్యాట్ లాంటి కఠినమైన పరీక్షల్లో విజయం సాధించడానికి నాణ్యమైన పునాదిని వేయడంలో ఈ పరీక్షల గొప్పదనం వెలకట్టలేనిది. మ్యాథ్స్ ఒలింపియాడ్ లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అస్ట్రానమీ ఒలింపియాడ్స్, ఇంకా జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లు ఉంటాయి. వీటిలోనూ వివిధ దశలుంటాయి.*
*💥ఒకటికి మించి రాయొచ్చు*
♦విద్యార్థులు తమకు ప్రావీణ్యం ఉన్న సబ్జెక్టులో ఒలింపియాడ్ రాసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లోనూ ఈ పరీక్షలకు హాజరుకావొచ్చు. ఒలింపియాడ్ పరీక్షల కోసం దేశాన్ని 25 ప్రాంతాలుగా విభజించారు. ఒక్కో ప్రాంతానికి ఒక కో ఆర్డినేటర్ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఒక్కో కో ఆర్డినేటర్ చొప్పున ఉన్నారు.
🔹ఆంధ్రప్రదేశ్: సుధాదేవి (విజయవాడ)
rmoandhra@gmail.com
🔹తెలంగాణ: ప్రొ.టి.అమరనాథ్ (హైదరాబాద్)
math.olympiad.telangana@gmail.com
♦ఈ 25 ప్రాంతాలకు అదనంగా సీబీఎస్‌ఈ పాఠశాలలన్నీ ఒక ప్రాంతం, నవోదయ విద్యాలయాలన్నీ ఒక ప్రాంతం, అలాగే కేంద్రీయ విద్యాలయాలన్నీ ఒక ప్రాంతం కిందకు వస్తాయి.
ఈ పోటీలకు సిద్ధం అయ్యే ప్రక్రియలో సబ్జెక్టు పరిజ్ఞానం చాలావరకు మెరుగవుతుంది. వివిధ ప్రవేశ పరీక్షల్లో ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచీ నచ్చిన సబ్జెక్టులో ఒలింపియాడ్ పరీక్షలకు సిద్ధపడటం అన్ని విధాలా శ్రేయస్కరం!
No comments:
Post a Comment