Followers

31 July, 2018

🌈ఇంక్రిమెంట్లు-రకాలు:🌈


*🌈ఇంక్రిమెంట్లు-రకాలు:🌈*

👉ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు .

 👉ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.

 👉APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించరు .
*(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)*

 👉నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.
*(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)*
*(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)*

👉DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.

 👉ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరుచేయాలి.
*(Memo.No.49463 Dt:06-10-1974)*

 👉ఉద్యోగి మొదటి వార్షిక  ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.
*Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి    ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.*

 👉నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.

 👉వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.

 *🌈ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము🌈*

👉-ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.

👉-అన్ని రకాల సెలవులు(జీత నష్టపు సెలవు తప్ప)

👉-డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.

👉-అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.

👉-పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.

👉-ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.

👉- ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)

 *🌈ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం🌈*

👉-జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు.సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.
👉- *జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భమూ:*

👉- వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది (ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు)
*(FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)*

👉- 6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సంధర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.

 *🌈ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:🌈*

👉-తప్పుడు ప్రవర్తనా,విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.

 *🌈Without Cumulative Effect:🌈*

👉FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు.అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.

 *🌈With Cumulative Effect:🌈*

👉దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి.సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి.ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి.ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

No comments:

Post a Comment