💝మెడికల్ రీయంబర్స్మెంట్💝
(MEDICAL REMBURESEMENT)
✴ ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును.
*(G.O.Ms.No.74 తేది:15-03-2005)*
✴ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.
*(G.O.Ms.No.397 తేది:13-11-2008)*
✴ కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.
✴ వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.
✴ ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.
*(G.O.Ms.No.68 తేది:28-03-2011)*
✴ కీమోథేరపీ, రేడియోథేరపీ,డయాలసిస్,క్యాన్సర్,కిడ్నీ,గుండెజబ్బులు,ఎయిడ్స్,నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.
✴ కంటి చికిత్స,దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.
✴ రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు.స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.
*(G.O.Ms.No.175 తేది:29-05-1997)*
✴ 40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.
*(G.O.Ms.No.105 తేది:09-04-2007)*
✴ మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.
*(DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008)*
✴ కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
*(G.O.Ms.No.87 తేది:28-02-2004)*
✴ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు జీవిత కాలంలో ఒకే వ్యాధికి 3 పర్యాయాల వరకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును.
*(G.O.Ms.No.601 M&H Dt:15-10-2003)*
✴ నిర్ణీత పదవీ విరమణ వయస్సు పూర్తి చేసి(సూపరాన్యుయేషన్) పై రిటైరైన వారికి మాత్రమే రీయింబర్స్మంట్ సౌకర్యం వర్తింపచేసారు.నిర్బంధ పదవీ విరమణ,వాలంటరీ రిటైర్మెంట్,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైర్మెంట్ పొందిన వారికి ఈ సౌకర్యం వర్తించదు.
*(G.O.Ms.No.401 Dt:25-06-1991)*
✴ హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది నుండి 6 నెలలలోపు, చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.
✴ రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No. *8878/D2-4/09 తేది:02-09-2009* ద్వారా వివరించారు.
No comments:
Post a Comment