Followers

14 January, 2020

సి డి దేశ్ ముఖ్

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹జనవరి 14, "సి.డి.దేశ్‌ముఖ్" గారి జయంతి సందర్భంగా  కొన్ని విషయాలు🌹

👉సి.డి.దేశ్‌ముఖ్ (జనవరి 14, 1896 - అక్టోబరు 2, 1982) పూర్తి పేరు చింతామణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ (Chintaman Dwarakanath Deshmukh). వీరు భారతీయ రిజర్వ్ బాంక్ మూడవ గవర్నర్ మరియు స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్.ఇతడు 1943, ఆగష్టు 11 నుంచి 1949, జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులైనాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁జననం🍁

👉1896, జనవరి 14 న జన్మించాడు. 1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్ ఇంగ్లాండులో నివసిస్తుంది.ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన దుర్గాబాయి దేశ్‌ముఖ్ను వివాహం చేసుకున్నాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన దేశ్‌ముఖ్ కు 1939 నుంచే రిజర్వ్ బ్యాంక్ తో సంబంధం ఉంది. 1941లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాధ్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. జూలై 1944లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అతడు కూడా భారత దేశం తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (International Monetary Fund-IMF) మరియు ప్రపంచ బ్యాంకు (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. 1950లో పారిస్లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁అవార్డులు🍁

👉1952లో దేశ్‌ముఖ్ విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయపు జేసస్ కళాశాల నుంచి గౌరవ ఫెలోగా ఎన్నికయ్యడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1959లో ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగ్సేసే అవార్డును పిలిప్పీన్స్కు చెందిన జోస్ అగ్విలార్ తో కల్సి సంయుక్తంగా పొందినాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1975లో భారత ప్రభుత్వం చే పద్మ విభూషణ పురస్కారం పొందినాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁మరణం🍁

👉1982, అక్టోబరు 2న మరణించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟

న్యాపతి సుబ్బారావు

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹జనవరి 14, "ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు" గారి జయంతి సందర్భంగా.... 🌹

👉ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 - జనవరి 15, 1941) స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు మరియు రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁బాల్యం, విద్యాభ్యాసం🍁

👉సుబ్బారావు 1856వ సంవత్సరం జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది. బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా కోస్తా జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, ది హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁రాజమండ్రిలో 🍁

👉ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించాడు. రాజమండ్రిలో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంతో సన్నిహితంగా మెలగేవాడు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించాడు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1885లో రాజమండ్రి పురపాలకసంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. *ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగాడు. 1896లో ఆయన రాజమండ్రిలోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రిక్‌ సప్లై కార్పొరేషన్‌ను స్థాపించి, విద్యుదుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్‌ను సరఫరా చేసి వెలుగులు నింపాడు. *1893లో ఆయన రాజమండ్రిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు ఆందుబాటులోకి తెచ్చాడు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం పంతులు ఎడిటర్‌గా వ్యవహరించాడు. రచయితల్ని ఆర్థికంగా ప్రోత్సహించటం లక్ష్యంగా సుబ్బారావు పంతులు నవలారచన అంశంగా వివిధ పోటీలు నిర్వహించేవాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనా వ్యాసంగానికి సుబ్బారావు నైతికంగా, ఆర్థికంగా ఎంతో సహకరించాడు. అదేవిధంగా హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసును రాజమండ్రి, పరిసర ప్రాంతాలకు పరిచయం చేసినది కూడా ఈయనే.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1922 ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధనా సంస్థ (ఇప్పుడు రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలగా ఉన్నది) ఏర్పాటును న్యాపతి సుబ్బారావు పంతులు ఎంతగానో ప్రోత్సహించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1897, ఫిబ్రవరి11న స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారతదేశం తిరిగివస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్రబృందం ఆయన్ను ఆహ్వానించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పురజనులు హాజరైన ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి న్యాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు. వివేకానందుడు మద్రాసు రేవులో దిగగానే పూలమాల వేసి ఆహ్వానించిన తొలివ్యక్తి సుబ్బారావే. ఆ మరుసటి రోజు విక్టోరియా హాల్లో వివేకానందునికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు.ఫిబ్రవరి14న మెరీనా బీచ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వివేకానందునితో పాటు సుబ్బారావు పంతులు వేదికను అలంకరించాడు. అలా ప్రారంభమైన వీరి స్నేహం సుబ్బారావుపై గాఢమైన ప్రభావాన్ని వేసింది. 1903లో వివేకానందుని స్ఫూర్తితో, సుబ్బారావు రాజమండ్రిలో భగవద్గీత మరియు సనాతన హిందూధర్మ ప్రచారానికై, హిందూ సమాజం అనే సంస్థను స్థాపించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1898 నుంచి 1917 వరకూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన కీలకమైన భూమికను పోషించాడు. 1907లో వందేమాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్‌ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించాడు. విజయవాడలో 1914 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపునిచ్చాడు. 1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్‌ మేరకు ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ను అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడయ్యాడు. అంతేగాక ఆయన అఖిలభారత కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలందించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉సుబ్బారావు పంతులు 1941, జనవరి 15వ తేదీన మరణించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟


16 November, 2019

AP: SA-1 ENGLISH QP AND KEY.. 2019-20

🌻🌹SA-1 ENGLISH QP AND KEY... 2019-20🌹🌻

For 6th class to 10th class QP.. CLICK HERE..

For Key.. CLICK HERE..

For 9th P-2 and 10th P-2 Key.. CLICK HERE..

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

10 November, 2019

FR-22

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🏵ప్రమోషన్ పొందిన సందర్భంలో వేతన స్థిరీకరణ🏵

🏵ఎఫ్ ఆర్ 22 బి ప్రాధాన్యత గురించి… వివరణ🏵

👉25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టు నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998 పిఆర్సీ స్కేళ్ళలో 8సంవత్సరాల స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1)ప్రకారం వేతన స్థిరీకరణ చేయబడేది.

👉2005 పిఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

👉2010, 2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.

👉దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.

👉ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.

👉1. ‘వాస్తవ ప్రమోషన్’ తేదీ నాడు గానీ లేదా

👉2. క్రిందిపోస్టులోని తదుపరి ‘ఇంక్రిమెంట్’  తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.

👉జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో  పైరెండింటిలో దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది.

👉ఉదాహరణ: అక్టోబర్ నెల ఇంక్రిమెంట్ తేదీగా గల 'రవి'  అనే ఉపాధ్యాయుడు తేదీ: 06.07.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.28940 – 78910 స్కేలులో రూ.44870/-లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.

👉ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణ:

👉1.తేదీ: 06-07-2019 నాటికి ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 44,870/-స్కేలు 28940 – 78910

👉2.ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 46060/- స్కేలు 28940 – 78910

👉3.స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,47330/- స్కేలు 28940 – 78910

👉4.తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.07.2020

👉ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీకి అంటే జులై నెలకు మారుతుంది

👉క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణ:

👉1.తేదీ 03.07.2019 నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 44,870/- స్కేలు 28940-78910

👉2.పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం వేతన నిర్ణయం: రూ, 46060 స్కేలు 28940-78910

👉3.తేదీ 01.10.2019న ఎస్జిటి పోస్టులో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 47,330 స్కేలు 28940 – 78910

👉4. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు(10/19)న:  రూ, 47330/- స్కేలు 28940 – 78910

👉5.స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం (10/19)న :  రూ,48,600/-  స్కేలు 28940 – 78910

👉6. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.10.2020

 👉పై రెండు పద్దతుల్లో ఇంక్రిమెంట్ తేదీకి వేతన నిర్ణయం చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ తేదీ పాతదే అంటే అక్టోబర్ నెల కొనసాగుతుంది.

 👉24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి  ఈ నిబంధన వర్తించదు. వారికి  ఎఫ్ ఆర్22ఎ (1) నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ ప్రయోజనం లభిస్తుంది.@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

💟💟💟💟💟💟💟💟💟💟